हैदराबाद: वरंगल सिटी यूथ कांग्रेस के नेता तोटा पवन पर हमले के मामले में पुलिस ने चार आरोपियों को गिरफ्तार कर लिया है। टीपीसीसी प्रमुख रेवंत रेड्डी की यात्रा समाप्त होने के बाद पवन पर आरोपियों ने हमला किया और गंभीर रूप से घायल हो गए। हमले की इस घटना को लेकर हनुमाकोंडा थाने में मामला दर्ज किया गया है।
पुलिस ने सीसीटीवी कैमरों के आधार पर आरोपियों की पहचान की। चेक्का सुमन, रावुला कोलनु नरेंदर, गुडिकंदुला विनोद कुमार और सिटीमोर सुनार कृष्णा को गिरफ्तार किया गया। हमले के मामले में शामिल अन्य आरोपियों की तलाश तेज कर दी गई है।

పవన్ పై దాడి చేసిన కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : వరంగల్ సిటీ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర ముగిసిన తర్వాత పవన్ పై నలుగురు నిందితులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ దాడి ఘటనపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. చెక్క సుమన్, రావుల కొలను నరేందర్, గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో సంబంధం ఉన్న మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన శివ ప్రసాద్ అనే వ్యక్తిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల శివప్రసాద్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పోలీస్ రోప్ దాటి చాలాసార్లు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. దీంతో రోప్ పార్టీ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ సాధిక్ పాషాపై దాడి చేశాడు.
నిన్న టిఆర్ఎస్ గుండాల చేతిలో గాయపడ్డ వరంగల్ యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ ను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరామర్శించేందుకు పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు ఆసుపత్రికి వెళ్లారు.

యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ పై జరిగిన దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దాడి చేసిన బిఆర్ ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలి
యువజన కాంగ్రెస్ నేత తోట ప్రవీణ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడిన దాడిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసిసి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం వరంగల్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై అరాచకంగా బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఆప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడికి ప్రోత్సహించిన, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన బావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించడం రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని పోలీసులు గ్రహించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు.
సోమవారం రాత్రి వరంగల్ లో జరిగిన హత్ సే హత్ జోడో పాదయాత్రలో సభ అనంతరం కొందరు టీ.అర్.ఎస్ గుండల దాడి లో గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ను చికిస్త కోసం సికింద్రాబాద్ అప్లోలో తరలించగా అక్కడ ఆయనను మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంత రావు కలసి పరామర్శించారు. అలాగే చికిస్తా అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడరు. ఈ సందర్భంగా వి.హెచ్ తో పాటు టీపిసిసి ప్రధాన కార్యదర్శి అదం సంతోష్ కుమార్ ఇతర నాయకులు ఉన్నారు.
ఈ సంఘటనపై పోలీసులు కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
సోమవారం రాత్రి వరంగల్ లో జరిగిన హత్ సే హత్ జోడో పాదయాత్రలో సభ అనంతరం కొందరు టీ.అర్.ఎస్ గుండల దాడి లో గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ను చికిస్త కోసం సికింద్రాబాద్ అప్లోలో తరలించగా అక్కడ ఆయనను మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంత రావు కలసి పరామర్శించారు. అలాగే చికిస్తా అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడరు. ఈ సందర్భంగా వి.హెచ్ తో పాటు టీపిసిసి ప్రధాన కార్యదర్శి అదం సంతోష్ కుమార్ ఇతర నాయకులు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (ఏజెన్సీలు)