మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93 వ జయంతి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడూతూ…

హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93 వ జయంతి సభ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావుని సత్కరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వినోద్ మాజీ మంత్రి టీజీ వెంకటేష్,మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, వాణి ప్రసాద్ ఐఏఎస్,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె ఏస్ ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగో ను ఆవిష్కరించిన మంత్రులు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడూతూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారు. ప్రజా జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలందిస్తూ శాసనసభ, శాసన మండలి, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

ఆర్థిక వ్యవహారాలపై ఆయనకున్న అపారమైన పట్టు, ప్రజాధనాన్ని ఎంతో బాధ్యతగా వినియోగించాలనే దృక్పథం ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి. రాజకీయ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన నాయకుడు రోశయ్య. ముఖ్యమంత్రిగా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడిపి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు.

Also Read-

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, హుందాతనంతో, సంయమనంతో వ్యవహరించడం ఆయన నాయకత్వానికి నిదర్శనం. నేటి రాజకీయ నాయకులు, యువత రోశయ్య నిరాడంబర జీవనశైలి, ప్రజాసేవ పట్ల అంకితభావం, విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోశయ్య సేవలను మరోసారి స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను.

నేను విద్యార్థి నాయకుల్లో nsui అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మా రాజకీయ గురువు చొక్కారావు తో కలిసి అనేక సార్లు వారితో మాట్లాడడం జరిగింది. నేను nsui అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పీసీసీ అధ్యక్షుడు గా నేను ఎంపీగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే రోశయ్య జీవితం ఆర్థిక క్రమశిక్షణ కు నిదర్శనం. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఆ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా విజయం సాధిస్తాం. వారు తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు వివిధ హోదాల్లో ఉన్నప్పుడు వారితో కలిసి నడవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X