AIRRF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు, పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

​హైదరాబాద్: ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRRF) ఆధ్వర్యంలో చిలకలగూడలో బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ​ఈ వేడుకలను AIRRF జాతీయ ఉపాధ్యక్షురాలు కృష్ణ కుమారి ఆధ్వర్యంలో సంధ్య గిరిజ మరియు గీత గార్ల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు.

​ఈ కార్యక్రమంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు (పెన్షనర్లు), ఫ్యామిలీ పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు.

Also Read-

​రైల్వే రిటైర్డ్ సిబ్బంది, వారి కుటుంబాల మధ్య ఐక్యతను, సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరికీ AIRRF నిర్వాహకులు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar