హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే దిశగా నేడు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అత్యధిక మెజారిటీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కార్యాచరణను రూపొందించారు.

ఈ సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సీతక్క మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, పట్టభద్రులు, యువత సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు విశేషంగా పాల్గొన్నారు.
