డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పలు విదేశీ భాషల్లో శిక్షణ, ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో…

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సమక్షంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, ఇగ్నిటస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబయి) డైరెక్టర్ మీటాసింగ్ కన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ… ప్రపంచీకరణ నేపథ్యంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదువు పూర్తి చేసిన విద్యార్ధులు సహా ఇతర యూనివర్సిటీ ల విద్యార్ధులకు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు ఇతర దేశాల్లో, మల్టీ నేషనల్ కంపనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి విదేశీ భాషలు నేర్చుకోవడం, వాటిలో శిక్షణ పొందడం విద్యార్ధులకు బాగా ఉపయోగపదనుందని వీసి ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.

ఇంగ్లీష్ సహా కొరియా, జపనీస్, జర్మనీ వంటి విదేశీ భాషల్లో మొదటగా శిక్షణను ఇవ్వనున్నట్లు, తర్వాత వీటిని ఇతర భాషలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం మేరకు స్కిల్ కోర్సులతో పాటు విదేశీ భాషల్లో స్కిక్షణను ఇవ్వడానికి యూనివర్సిటీ లోనే ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read-

ఈ కార్యక్రమంలో ఇగ్నిటస్ డైరెక్టర్లు కన్వర్ ప్రబ్జోత్ సింగ్, పద్మ ప్రియ వేములపట్టి, విశ్వవిద్యాలయ ఇంచార్జ్ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఇ. సుధా రాణి, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ సెంటర్ డైరెక్టర్ ప్రొ. పల్లవి కాబ్డే, వీసీ ఒఎస్ది ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, కోర్సు కో ఆర్డినేటర్ ప్రొ. కిశోర్ కుమార్ రెడ్డి, ప్రొ. రాణి రజిత మాధురి, డా. వై. వెంకటేశ్వర్లు; ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. రజనీ, ప్రొ. పి. వెంకట రమణ, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X