హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ కి రాజ్యసభ సీటు విషయంలో బీజేపీ మరోసారి మహిళా వ్యతిరేకి అని నిరూపించుకుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నఈ నిర్ణయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని తెలంగాణ రాష్ట్ర పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.

Meenakshi Natarajan
బీజేపీ రాజకీయంగా విఫలమై, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. గతంలో ప్రజల ఓట్లను మాయమాటలతో “ఓటు చోరీ” చేసిన బీజేపీ, ఇప్పుడు రాజకీయ అవకాశాల విషయంలో కూడా “సీటు చోరీ” చేసే స్థాయికి దిగజారింది. ఇది వారి రాజకీయ సంస్కృతి ఏంటో స్పష్టంగా చూపిస్తుంది.
మీనాక్షి నటరాజన్ గారు పార్టీకి అంకితభావంతో సేవలందించిన నాయకురాలు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకురాలికి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావించింది. కానీ బీజేపీ మాత్రం మహిళలకు అవకాశాలు ఇవ్వడం కంటే, వచ్చిన అవకాశాలను అడ్డుకోవడంపైనే దృష్టి పెట్టింది.
Also Read-
మహిళల పురోగతిని అడ్డుకోవడం బీజేపీ అసలు స్వరూపం. కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళల అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. బీజేపీ చేస్తున్న ఈ కుట్రలను ప్రజలు గమనించి తగిన సమాధానం ఇస్తారని మేము విశ్వసిస్తున్నాము. న్యాయపరంగా మీనాక్షి నటరాజన్ కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తాము.
