భువనగిరి: స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ‘కుంభం ఫౌండేషన్’, IBM Skills Build సహకారంతో నిర్వహించిన భారీ ఉపాధి మేళా (Job Mela) అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగి
రి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మరియు భువనగిరి శాసనసభ్యులు, కుంభం ఫౌండేషన్ అధినేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. ఐబిఎం (IBM) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయడం వల్ల స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉద్యోగాలు పొందే అవకాశం దక్కుతుందని అన్నారు.

Also Read-
ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రాథమిక ఇంటర్వ్యూల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు అతిథుల చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
