తెలంగాణ అభివృద్ధికి మోదీ ‘గ్యారెంటీ’ : డా. కె. లక్ష్మణ్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసే పర్యటన అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. “మోదీ అంటే మోడల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా” అని, దేశ ప్రజలు తమ తీర్పుతో మోదీ పట్ల ఉన్న విశ్వాసాన్ని పదే పదే నిరూపిస్తున్నారని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కమలం జెండా రెపరెపలాడుతున్న వేళ, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ ‘వికాస్, విశ్వాస్, విరాసత్’ అనే నినాదాలతో ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ను ఆచరణలో చూపిస్తుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండి కూటమికి ఎటువంటి అజెండా లేదని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ + బీఆర్ఎస్ = ఎంఐఎం అని, ఈ మూడు పార్టీల పేర్లు వేరైనా వారి విధానాలు ఒకటేనని మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన, వంశపారంపర్య రాజకీయాలే ఆ పార్టీల లక్ష్యాలని.. లౌకికవాదం పేరుతో ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతూ హిందువులను, దేవీదేవతలను కించపరచడమే వీరు పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని మెప్పించుకోవడానికి “కాంగ్రెస్ ఈజ్ ముస్లిం.. ముస్లిం ఈజ్ కాంగ్రెస్” అనే స్థాయికి దిగజారారని, ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదు.. ‘అనుముల రేవంత రెడ్డి’గా మారుతున్నారని ఆరోపించారు.

నాడు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ని అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకుంటే, నేడు అయోధ్య రామమందిరాన్ని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ద్వేషిస్తున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తాతా-మనుమల తీరు ఒకేలా ఉందని ఫైరయ్యారు. భారతదేశ ఆధ్యాత్మిక బలాన్ని దెబ్బతీయడానికి టిప్పు సుల్తాన్, బాబర్, గజినీ వంటి వారు దాడులు చేసినా సనాతన ధర్మాన్ని ఏం చేయలేకపోయారని, కానీ నేడు కాంగ్రెస్ వారి జయంతి ఉత్సవాలు చేస్తూ దేశాన్ని కించపరుస్తోందని మండిపడ్డారు. కమ్యూనల్ వైలెన్స్ బిల్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వంటివి కేవలం హిందూ సంస్థలను అణచివేయడానికే తెచ్చారని ఆరోపించారు.

Also Read-

సీఎం రేవంత్ రెడ్డి ‘హేట్ స్పీచ్’ చట్టం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ధైర్యముంటే హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేసిన ఓవైసీని జైల్లో వేయాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి పదేపదే భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను కించపరుస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక విజయాలను, మహిళా అధికారులు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వంటి వారి సేవలను కించపరచడం దురదృష్టకరమన్నారు. గంగా స్నానం చేస్తే పేదరికం పోతుందా అని ఖర్గే గారు అనడం వంద కోట్లకు పైగా ఉన్న హిందువుల విశ్వాసాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు AIIMS, రామగుండం ఎరువుల కర్మాగారం, జాతీయ రహదారులు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు, కొత్తగా హైస్పీడ్ రైళ్లు వంటి వేల కోట్ల అభివృద్ధిని ప్రధాని మోదీ అందించారని వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే పార్టీలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు స్వాగతం పలుకుతున్నారని అన్నారు. నిజాం రజాకార్ల అరాచక పాలనను సమర్థించే స్థాయికి దిగజారిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకోవాలని సూచించారు.

తమిళనాడులో కాంగ్రెస్ తన అధికార దాహంతో ద్రోహపూరిత రాజకీయాలు చేస్తోందని, డీఎంకే సైతం వారిని అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గవర్నర్ వ్యవస్థపై చేస్తున్న విమర్శలను ఖండిస్తూ.. ప్రీ-పోల్ అలయన్స్ లేనప్పుడు మెజారిటీ నిరూపించుకోవాల్సిన బాధ్యత పార్టీలపైనే ఉంటుందని, మెజారిటీ నంబర్ చూపించలేక కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని స్పష్టం చేశారు. అలాగే ఓటరు జాబితా ప్రక్షాళన (SSR) అనేది ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రక్రియ అని, దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్ల కోసం దానిని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి అనడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు. 2029 నాటికి తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని, ఇతర పార్టీల ప్రముఖులు సైతం మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నారని డా. కె. లక్ష్మణ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X