హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పరిశోధనలను బలోపేతం చేయడం మరియు డిజిటల్ విద్యా వసతుల కల్పన, అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. మంగళ వారం యూనివర్సిటీ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌ఫ్లిబ్‌నెట్ సెంటర్ (INFLIBNET Centre) డైరెక్టర్ ప్రొఫెసర్ దేవికా మడళ్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ (ONOS) ను ప్రారంభించారు. దీంతో 13 వేల పరిశోధనా జర్నల్స్ అటు పరిశోధకులకు ఇటు అధ్యాపకులకు ఉచితంగా అందుబాటులోకి రానున్నట్లు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు పరిశోధకులకు ఉపయోగపడే అనేక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు అకాడమిక్ నాణ్యత, పరిశోధన సమగ్రత, విద్యార్ధులకు సమాన అవకాశాలు అందించడానికి ఉపయోగపడనున్నాయి. నాణ్యమైన పరిశోధనలు జరగాదానికి అవకాశం ఏర్పడిందన్నారు.
ఈ సందర్భంగా ఇన్‌ఫ్లిబ్‌నెట్ (INFLIBNET) “కార్నెట్” ఆవిష్కరణ ఇది చెట్టు ఆకారంలో రూపొందించబడిన వినూత్న నిర్మాణం. ఇందులోని ప్రతి కొమ్మపై QR కోడ్‌లు అమర్చబడి, వాటి ద్వారా ShodhChakra అనే సమగ్ర పరిశోధన నిర్వహణ వ్యవస్థకు సులభంగా ప్రాప్యత లభిస్తుంది. పరిశోధకులు ప్రవేశం నుండి థీసిస్ సమర్పణ వరకు ప్రతి దశలోసూచనలు, సలహాలు అందుకొంటారు. పరిశోధన నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి, ప్లగరిజం తనిఖీ చేసే సాఫ్ట్‌వేర్‌ను కూడా అమల్లోకి తేనున్నారు. దీని ద్వారా ప్రతి థీసిస్ సమగ్రంగా పరిశీలించడానికి వీలు కలుగుతుంది. ఆ తర్వాత ShodhGanga లో అప్లోడ్ చేస్తారు. తద్వారా పరిశోధనా నాణ్యత పెరుగుతుందని వెల్లడించారు.
Also Read-
అదేవిధంగా యూనివర్సిటీ, ఇన్‌ఫ్లిబ్‌నెట్ మధ్య పరస్పర సహాకారినికి ఆమోదం వ్యక్తపర్చారు. 1.5 లక్షలకు పైగా విద్యార్థులకు సేవలు అందించే సమగ్ర లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)ను అమల్లోకి రానుంది. ఈ LMS ద్వారా వీడియోలు, ఆడియోలు మరియు పాఠ్య రూపంలో ఉన్న శిక్షణా వనరులు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ స్వంత వేగంతో, ఇంటరాక్టివ్ విధానంలో మైక్రో-క్రెడెన్షియల్స్ సహా వివిధ కోర్సులను అభ్యసించే అవకాశం ఏర్పడనుంది. ఈ కార్యక్రమం సందర్భంగా, సాంకేతికతను వినియోగించి విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం మరియు పరిశోధనలో నాణ్యతను పెంపొందించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ముందు ముందు ఇన్‌ఫ్లిబ్‌నెట్ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదిక కానుందని పేర్కొన్నారు.
Also Read-
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా అమల్లోకి వచ్చేలా ప్రొ. వి. చక్రపాణి మరియు ఇన్‌ఫ్లిబ్‌నెట్ డైరెక్టర్ ప్రొ. దేవికా మడళ్లి గారు పరస్పరం అంగీకరించారు. ఈ ఒప్పందం ద్వారా పరిశోధన మద్దతు వ్యవస్థలు, డిజిటల్ వనరులు, అకాడమిక్ సహకారం వంటి అంశాల్లో సహకరించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు Pradhan Mantri Uchchatar Shiksha Abhiyan (PM-USHA) పథకం కింద చేపట్టనున్నారు. ఈ పథకం భారతదేశంలో ఉన్నత విద్యా నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రొ. దేవికా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; విశ్వవిద్యాలయ లైబ్రరీ ఇంచార్జ్ ప్రొ. ఎన్. రజని, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పి. వెంకట రమణ; ప్రొ. బి. శ్రీనివాస్; ప్రొ. కె. శ్రీదేవి; డా. వై వెంకటేశ్వర్లు, కంప్యూటర్ సెంటర్ ఇంచార్జ్ వసంత రావు, ప్రొ. ఏ. ఆర్. డి. ప్రసాద్ అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు.
