హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.టీ. రామారావు మంగళవారం మధ్యాహ్నం జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద ఉన్న ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులు తాము 15 రోజుల కిందట తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రాత్రిబవళ్లు ఇక్కడ కాలం గడుపుతున్నామని, కష్టాలు కడతేర్చాలంటూ కేటీఆర్ ముందు ఏకరువు పెట్టారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు.
Also Read-
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు తన రెండు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జనగామలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి తేనీరు స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర ప్రముఖులు ఉన్నారు.
