तेज रफ्तार बस चालक को आई नींद, पलट गई बस, चार यात्रियों की मौके पर मौत

हैदराबाद: निज़ामाबाद ज़िले में एक बड़ा सड़क हादसा हुआ है। इंदलवाई मंडल के गन्नारम के बाहरी इलाके में ब्रह्मनगरी मंदिर के पास नेशनल हाईवे 44 पर सुबह करीब 2 बजे एक टूरिस्ट बस सड़क किनारे पलट गई। स्थानीय लोगों ने पुलिस को घटना की जानकारी दी। पुलिस मौके पर पहुंची और बचाव के उपाय किए। पुलिस ने केस दर्ज कर लिया है और जांच कर रही है।

पुलिस के मुताबिक, टूरिस्ट बस तेज़ रफ़्तार से जा रही थी, तभी ड्राइवर नींद में चला गया और बस पलट गई। हादसा गन्नारम गांव के बाहरी इलाके में ब्रह्मनगरी मंदिर के पास हुआ। घटना के समय बस में 36 यात्री सवार थे। बस हैदराबाद से नागपुर जा रही थी। हादसे के तुरंत बाद स्थानीय लोगों ने घायलों को बाहर निकालने की कोशिश की। इस दौरान पुलिस और इमरजेंसी सर्विस को जानकारी दी गई।

पुलिस ने बताया कि हादसे में चार यात्रियों की मौके पर ही मौत हो गई। संदेह है कि बस पलटने से गंभीर चोटों के कारण उनकी मौत हुई। अधिकारी मृतकों की जानकारी एकत्रित कर रहे हैं। इस हादसे में चार लोगों की मौत हो गई और कई यात्री गंभीर रूप से घायल हो गए। इस घटना से मृतकों के परिवार गहरे दुख में हैं। पुलिस मामले की जांच कर रही है।

यह भी पढ़ें-

ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టూరిస్ట్ బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం గన్నారం గ్రామ శివారులోని బ్రహ్మంగారి ఆలయం దగ్గర చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు.

ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సమయంలో తీవ్ర గాయాల కారణంగా వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X