హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఈ రోజు ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA ) వెబ్సైట్ ideaindia.netను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీలలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో దేశంలోని అన్ని ఓపెన్ యూనివర్సిటీల నుంచి విద్యావేత్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామ రావు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఐడియా ఉపాధ్యక్షులు ప్రొ. జిలాని; మానూ యూనివర్సిటీ అధ్యాపకులు ఐడియా ప్రతినిధి ప్రొ. ముస్తాక్ అహ్మద్, మాజీ రిజిస్ట్రార్ ప్రొ. సి. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read-
PROF GHANTA CHAKRAPANI LAUNCHED ‘IDEA’ WEBSITE
Hyderabad : Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU launched Indian Distance Education Association (IDEA) website (ideaindia.net) at its campus on Wednesday. Prof. Chakrapani said the University in collaboration with IDEA will organising a two-day National Conference on “Beyond Boundaries : The New ODL Landscape” on March 25 & 26, 2026.
The Program was attended by Prof. K. Seetharama Rao, President, IDEA, Dr. LVK Reddy, Secretary General, IDEA and Prof. S. Jeelani, Prof. Mushtaq Ahmed vice president and Secretary IDEA participated.
