Maha Padayatra: ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం. Let Us Protect Democracy Let Us End Anarchy!

హైదరాబాద్ : నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌లో కుట్రదారులకు, ఢిల్లీలో గుంట నక్కలకు వినిపించేలా వందేమాతరం నినాదాలు మార్మోగాలని పిలుపునిచ్చారు.వర్షం పడుతుంటే శుభసూచకమని, తెలంగాణలో రాబోయేది కాషాయ జెండా అని స్పష్టం చేశారు. సునీల్ బన్సల్ ఇక్కడికి రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేసిన సునీల్ బన్సల్ కి స్వాగతం పలుకుతూ, 3 కిలోమీటర్ల పాదయాత్రలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో నలుగురిని పోగేసుకొని కాంగ్రెస్ పార్టీ COCKROACH పార్టీగా మారి అరాచకాలు సృష్టిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఆయన చేస్తున్నది పేరు చోరీ రాజకీయాలని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కుటుంబ చరిత్రను ప్రస్తావిస్తూ, ఫిరంగి జహంగీర్ నుంచి రాజీవ్ గాంధీ, అక్కడి నుంచి రాహుల్ గాంధీ వరకు వచ్చిన కుటుంబ రాజకీయాలపై ప్రశ్నలు సంధించారు.

విదేశీ కుట్రలతో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలను భారత్‌లోనూ సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే Gen-Z, Gen-Bharat అలాంటి కుట్రలను అనుమతించబోదని, యువత దేశం వైపే నిలుస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ముఠా మేస్త్రీగా చెప్పుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన మూటల మేస్త్రీ అని విమర్శించారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ, ఢిల్లీలో మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆపి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రూ.4,000 పెన్షన్ ఇవ్వలేదు, యువతకు ఉద్యోగాలు కల్పించలేదు, విద్యార్థులకు Fee Reimbursement చెల్లించలేదు, రైతులకు రైతు భరోసా అందించలేదు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ, వారి సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ, వారి సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ కోట్లాది ప్రజల గుండెల్లోంచి పుట్టిన నాయకుడని, పది బొద్దింకలు ఆయనను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ, ఇప్పటివరకు ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయో ఆధారాలతో చెప్పగలరా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పేరుతో 3 కోట్ల ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న తపన, తాపత్రయం ఏమిటని నిలదీశారు.

ఓట్లతోనే గెలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు, తమ గ్రామాల్లో ఒక్క ఓటైనా తొలగించబడిందా అని ప్రజలను అడగాలని అన్నారు. కేరళలో, తమిళనాడులో కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎలా గెలిచాయి? రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని చెప్పే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కాంగ్రెస్ అరాచకవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం!

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ సహ ఇన్‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ సహ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేఖా శర్మ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేశ్, ముధోల్ ఎమ్మెల్యే, రామారావు పాటిల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Hyderabad : Addressing the Maha Padayatra held in Nirmal, BJLP Floor Leader and Nirmal MLA Alleti Maheshwar Reddy launched a scathing attack on the Congress party. He called for Vande Mataram slogans to reverberate loudly enough to reach the conspirators in Pakistan and the “jackals” in Delhi. He said that rain during the event was an auspicious sign and asserted that the saffron flag would soon fly across Telangana. He stated that the presence of Sunil Bansal in Telangana was itself an indication of this change. Welcoming Sunil Bansal garu, who had helped the BJP hoist the saffron flag in Odisha, Uttar Pradesh and West Bengal, he thanked all the people who participated in the three-kilometre-long padayatra, braving the rain.

He criticised the Congress party for gathering a handful of people in Delhi along with so-called “COCKROACH party” that creates chaos, stating that the people of the country were closely observing its conduct. He ridiculed Rahul Gandhi’s allegations of vote theft, saying that Rahul Gandhi was instead engaged in “name-theft.” Referring to the Gandhi family’s history, he questioned the family’s political legacy from Firoz Jahangir to Rajiv Gandhi and then Rahul Gandhi.

He alleged that the Congress was attempting to replicate in India the developments witnessed in Nepal, Sri Lanka and Bangladesh, which he attributed to foreign conspiracies. He asserted that Gen-Z and Gen-Bharat would not allow such conspiracies to succeed and that the youth would stand with the nation. He criticised Revanth Reddy for describing himself as a “Mutha mesthri,” saying that he was, in reality, a “Mootala Mesthri.” He alleged that Revanth Reddy was betraying the people who had made him Chief Minister by carrying currency bundles in Delhi.

He advised Revanth Reddy to stop going around Rahul Gandhi and instead work for the people of Telangana.
Questioning the Congress government over its six guarantees, he said it had completely failed to fulfil the promises made to the people. He alleged that the government had not provided the promised ₹4,000 pension, had failed to provide jobs to the youth, had not paid Fee Reimbursement to students, and had not delivered Rythu Bharosa to farmers. He said the government was doing injustice to all sections of society, neglecting their problems and focusing on politics in Delhi.
He asserted that Narendra Modi garu was a leader who had emerged from the hearts of crores of people and expressed confidence that “ten cockroaches” could do him no harm.

Questioning Rahul Gandhi’s allegations of vote theft, he asked whether Rahul Gandhi could provide evidence of how many votes had actually been deleted. He also questioned the Congress party’s eagerness to secure three crore votes in the name of Bangladeshi infiltrators and Rohingyas. He said Congress leaders who claimed to have won through votes should ask people in their own villages whether even a single vote had been deleted. He questioned how Congress and other parties had won in Kerala and Tamil Nadu, and how Revanth Reddy himself had won. Challenging Revanth Reddy, who had expressed distrust in the Election Commission, he asked him to resign as Chief Minister and face fresh elections. Alleti Maheshwar Reddy garu asserted that the BJP’s fight to protect democracy and put an end to Congress’s anarchic politics would continue relentlessly. Let Us Protect Democracy… Let Us End Anarchy!

Leaders who participated in the programme: BJP Telangana State President N. Ramchander Rao; BJP National General Secretary and Telangana State In-charge Sunil Bansal; Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar; Telangana BJP Co-In-charge and Karnataka MLA Abhay Patil; Telangana BJP Co-In-charge and Rajya Sabha MP Smt. Rekha Sharma; Malkajgiri MP Eatala Rajender; Adilabad MP Godam Nagesh; Mudhole MLA Ramarao Patil; Adilabad MLA Payal Shankar; Sirpur MLA Palvai Harish Babu; Nizamabad Urban MLA Dhanpal Suryanarayana; Armur MLA Paidi Rakesh Reddy; MLC Anji Reddy; along with other BJP leaders, party workers and a large number of people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar