Hyderabad : TPCC President and MLC Mahesh Kumar Goud stated that the farmer who feeds the nation is the true backbone of the country. He said that the hard work and sacrifices of farmers form the foundation of the nation’s development.
On the occasion of National Farmers’ Day, he extended greetings to farmers across the country on behalf of the TPCC, paying tribute to the annadatas. He reiterated that the Congress party has always stood by farmers and continues to fight relentlessly for their rights.
He said the Congress party is working with commitment to ensure farm loan waivers, Rythu Bharosa, remunerative prices, and irrigation rights for farmers. He criticized the BJP-led central government for completely neglecting farmers’ issues.
Also Read-
He pointed out that rising prices of fertilizers, seeds, and diesel have caused severe financial distress to farmers, and that the BJP’s promise of doubling farmers’ income has remained limited to mere words.
He noted that after coming to power in Telangana, the Congress government has given top priority to farmers’ welfare. Through the implementation of the Rythu Bharosa scheme and the restoration of irrigation projects, confidence is being instilled among farmers.
He affirmed that farmers’ welfare is the primary objective of the Congress government, and that the party remains committed to policies that protect farmers’ self-respect. Reiterating the principle that only when farmers prosper will the nation prosper, Mahesh Kumar Goud said the Congress is moving forward with this vision.
Also Read-
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
దేశానికి అన్నం పెట్టే రైతే దేశానికి నిజమైన వెన్నెముక అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రైతుల శ్రమ, త్యాగాలే దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచాయని ఆయన అన్నారు.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు టీపీసీసీ తరఫున అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలిచి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ,గిట్టుబాటు ధర, సాగునీటి హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం అమలు, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సిద్ధాంతంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
