हैदराबाद : गुरुवार को आईपीएल-2025 के नॉकआउट का शुभारंभ पंजाब किंग्स और रॉयल चैलेंजर्स बेंगलुरु के बीच होगा। यह दोनों टीमों के बीच इस सीजन का पहला क्वालिफायर मैच है। इस मैच में जो भी टीम जीतेगी, वह सीधे फाइनल में पहुंच जाएगी। यह मैच न्यू चंडीगढ़ के मुल्लांपुर क्रिकेट स्टेडियम में खेला जाएगा। पंजाब किंग्स का घरेलू मैदान पर भी है। आरसीबी के लिए यह मैच निकालना चुनौतीपूर्ण होगा।
हालांकि, अच्छी बात ये है कि क्वालिफायर-1 में अगर कोई टीम हारती है तो उसे फाइनल में पहुंचने के लिए एक दूसरा मौका भी मिलता है। पहले क्वालिफायर में हारने वाली टीम एलिमिनेटर की विजेता से खेलेगी और दोनों के बीच क्वालिफायर-2 खेला जाएगा और उससे दूसरी फाइनलिस्ट टीम तय होगी।

वैसे तो हर मैच की तरह पहले क्वालिफायर की शुरुआत शाम तो 7.30 बजे होगी। वहीं टॉस शाम 7 बजे होगा। टॉस जीतने वाली टीम को मैच जीतने की ज्यादा संभावना है। मौसम की बात करें तो यह बिल्कुल साफ रहने की उम्मीद है। एक्यूवेदर की रिपोर्ट के मुताबिक शाम के 7 बजे का तापमान 32 डिग्री सेल्सियस रहने की उम्मीद है। आसाम लगभग साफ रहेगा। आसमान में क्लाउड कवर 21 प्रतिशत रहेगी। ऐसे में बारिश की संभावना काफी कम है। यदि बारिश होकर मैच रद्द होता है तो रन रेट के आधार पर पंजाब किंग्स फाइनल में पहुंचेगी।
यह भी पढ़ें-
फिर भी, शाम के समय उमस से थोड़ी परेशानी हो सकती है। पहाड़ी क्षेत्र के नजदीक होने के कारण मुल्लांपुर में मैच के दौरान ओस की संभावना भी है। मैच बढ़ने के साथ करीब 8 बजे क्लाउड प्रतिशत में गिरावट बताई जा रही है। इससे बारिश के लिए कोई संभावना नहीं है। दोनों टीमों के बीच बिना किसी बाधा के एक रोमांचक और घमासान मैच देखने को मिलने की उम्मीद है। (एजेंसियां)
క్వాలిఫైయర్ 1కు అంతా సిద్ధం
హైదరాబాద్ : ఐపీఎల్ మొదలై ఈ 18 ఏళ్లులో ఒక్కసారి కూడా కప్పు కొట్టని ఈ రెండు జట్లు. ఈసారి లీగ్ దశకు చేరుకున్నయి పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అద్భుతమైన పట్టుదల, అమేజింగ్ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచాయి. గురువారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 జరగనుంది. ఈ సీజన్లో పంజాబ్, బెంగళూరు టీమ్స్ ఆటతీరు చూసిన అభిమానులు ఈ ఏడాది ట్రోఫీ తమదే అని ఫీలవుతున్నారు. దానికితోడు ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి తప్ప ట్రోఫీలన్నీ టాప్-2లో ఉన్న ఏదో ఒక జట్టే గెలవడం కూడా వాళ్ల ఆశలకు మరింత బూస్ట్ ఇస్తోంది. అందుకే టాప్-2లో ఉండేందుకు జట్లన్నీ అంత కష్టపడేది. అంతేకాక క్వాలిఫైయర్-1లో ఒకవేళ ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. అయితే ఫైనల్ చేరే జట్టు చేతిలో ఓడిపోతే టీం ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి ఎలాగైనా క్వాలిఫైయర్-1లో గెలిచి ఫైనల్ చేరాలని పంజాబ్, బెంగళూరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ రెండు జట్ల హిస్టరీ చూస్తే పంజాబ్ జట్టే మెరుగైన రికార్డుతో ఉంది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్, బెంగళూరు జట్లు మొత్తం 35 సార్లు తలపడ్డాయి. వీటిలో 18 మ్యాచుల్లో పంజాబ్ గెలవగా 17 సార్లు బెంగళూరు విజయం సాధించింది. అంటే రెండు జట్లు దాదాపు సమవుజ్జీలనే చెప్పాలి. కానీ చివరి ఐదు మ్యాచులు చూస్తే మాత్రం పంజాబ్ కొంచెం వెనుకబడిందని చెప్పకతప్పదు. ఎందుకంటే ఈ రెండు జట్లు తలపడిన చివరి ఐదుసార్లలో ఏకంగా నాలుగు సార్లు బెంగళూరు గెలిచింది. పంజాబ్ గెలిచిన మ్యాచ్ కూడా వర్షం వల్ల 14 ఓవర్లకు కుదించినదే కావడం గమనార్హం. చివరగా ముల్లాన్‌పూర్‌లో ఈ రెండు జట్లు ఆడినప్పుడు కూడా బెంగళూరే గెలిచింది. పంజాబ్ జట్టు చివరగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడింది 2014లో. ఆ సంవత్సరం పంజాబ్ ఫైనల్ కూడా చేరింది. కానీ కేకేఆర్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆ సంవత్సరం కూడా పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలవగా.. కేకేఆర్ రెండో స్థానంలో లీగ్ దశను ముగించింది. అంటే రెండో స్థానంలో నిలిచిన జట్టు చేతిలో ఫైనల్ ఓడిన పంజాబ్.. కప్పు కోల్పోయింది. మరి ఈసారి కూడా అదే పద్ధతిలో బెంగళూరు చేతిలో ఓడుతుందా? లేక అప్పటి తప్పును సరిదిద్దుకొని కప్పుతో 18 ఏళ్ల కరువు తీర్చుకుంటుందా? చూడాలి.
ఇప్పటికి మూడుసార్లు ఫైనల్ చేరినా కప్పు కొట్టని జట్టు ఆర్సీబీ. 2009లో డెక్కన్ చార్జర్స్ చేతిలో, 2011లో చెన్నయ్ చేతిలో, 2016లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిందీ జట్టు. ముఖ్యంగా 2016లో ఆర్సీబీ రెండో స్థానంలోనే లీగ్ దశను ముగించింది. కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో కప్పు తమదే అని ఆ టీం ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఫైనల్లో ఆ టీం తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని ఆ టీం అనుకుంటోంది. ఈ క్రమంలోనే క్వాలిఫైయర్-1లో పంజాబ్‌ను ఓడించి ముందుగా ఫైనల్ చేరాలని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కోహ్లీ, సాల్ట్ అందించే ఆరంభం ఆర్సీబీ విజయాలకు చాలా ముఖ్యం. అయితే చివరి రెండు, మూడు మ్యాచుల్లో పటీదార్ పేలవంగా ఆడటం, పడిక్కల్ లేకపోడం ఈ టీంకు సమస్యలుగా మారాయి. పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ ఆట గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. చివర్లో షెఫర్డ్, టిమ్ డేవిడ్ వంటి హిట్టర్లు ఉన్నా కూడా ఈ టీం మిడిలార్డర్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. అయితే బౌలింగ్ విభాగంలో ఈ టీం పటిష్టంగా కనిపిస్తోంది. జోష్ హేజిల్‌వుడ్ రాక కచ్చితంగా జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుంది. భువనేశ్వర్ ఫర్వాలేదనిస్తున్నాడు. కృనాల్ పాండ్యా కూడా చక్కగా ఆడుతున్నాడు. వీళ్లే ఈ జట్టు విజయానికి చాలా కీలకం.
ప్రభ్సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య ఈ జట్టుకు అదిరిపోయే ఆరంభాలు అందిస్తున్నారు. ఇక మూడో స్థానంలో జోష్ ఇంగ్లిస్ కూడా అదరగొడుతున్నాడు. అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్టొయినిస్ తిరిగి రావడంతో లోయర్ ఆర్డర్లో హిట్టర్ల సంఖ్య పెరిగింది. శశాంక్ సింగ్ కూడా బాగానే ఆడుతున్నాడు. బౌలింగ్‌లో అర్షదీప్, యాన్సెన్, బ్రార్ ఆకట్టుకుంటున్నారు. అయితే చాహల్‌కు గాయం ఈ జట్టుకు పెద్ద సమస్య. లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు రెండు జట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఆడిన 14 మ్యాచుల్లో 9 విజయాలతో రాణించాయి. ఈ రెండు జట్ల దగ్గర 19 పాయింట్లే ఉన్నాయి. కాకపోతే పంజాబ్ నెట్ రన్ రేట్ (0.372).. ఆర్సీబీ (0.301) కన్నా కొంచెం ఎక్కువ కావడంతో పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ రికార్డును చూస్తేనే.. రెండు టీమ్స్‌లో దేన్నీ ఫేవరెట్‌గా చూడలేమనే విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో రెండు టీమ్స్ అలా ఆడాయి. అద్భుతమైన బ్యాటింగ్, అదరగొట్టే బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించి టాప్-2 జట్లుగా నిలిచాయి. అయితే పంజాబ్ కింగ్స్‌కు ముల్లాన్‌పూర్ హోంగ్రౌండ్ అనే విషయం మర్చిపోకూడదు.
ఆర్సీబీ ఈ ఏడాది అద్భుతంగా రాణించడానికి ప్రధాన కారణం ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ మ్యాచ్ విన్నర్‌గా మారడం. గతంలో ఎవరో ఒకరిద్దరిపైనే ఆధారపడిన ఈ జట్టు.. ఈసారి మాత్రం సమిష్టిగా రాణిస్తూ ప్లేఆఫ్స్ చేరింది. అందుకే ఆ టీం ఫ్యాన్స్ అంతా ఈసారి ట్రోఫీ తమదే అని ఫీలవుతున్నారు. పాంటింగ్, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ తలరాత పూర్తిగా మారిందనే చెప్పాలి. వేలం సమయంలోనే ఈ టీం ప్లేఆఫ్స్‌కు చేరుతుందని చాలామంది అంచనా వేశారంటేనే జట్టుపై పాంటింగ్ ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఇక అయ్యర్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకున్నప్పుడు చూశాం కదా. ఇంత గొప్పగా ఆడుతుంది కాబట్టే పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. (ఏజెన్సీలు)
