हैदराबाद : तेलंगाना में प्रतिबंधित सीपीआई (माओवादी) पार्टी के 38 सदस्यों ने शनिवार को भद्राद्री कोत्तागुडेम के पुलिस अधीक्षक रोहित राजू के समक्ष आत्मसमर्पण किया। इनमें पार्टी सदस्य- (02), मिलिशिया सदस्य- (16), वीसीएम (7), केएएमएस सदस्य-06, सीएनएम- 3 और जीआरडी-4 शामिल हैं। एसपी रोहित राजू ने बताया, “यह नक्सलवाद का रास्ता छोड़कर अपने परिवार के सदस्यों के साथ शांतिपूर्ण जीवन जीने का फैसला किया है। आत्मसमर्पण करने वाले माओवादियों के कल्याण के लिए उठाए जा रहे कल्याणकारी उपायों और आदिवासी लोगों के लिए विकास और कल्याण गतिविधियों के बारे में जानने के बाद जिला पुलिस के समक्ष आत्मसमर्पण कर दिया।
विभिन्न कैडर के माओवादियों अपने हथियार छोड़कर आत्मसमर्पण करना पसंद कर रहे हैं। क्योंकि वे आत्मसमर्पण करने वाले माओवादी सदस्यों को तेलंगाना सरकार द्वारा प्रदान की जा रही पुनर्वास सुविधाओं से आकर्षित हुए हैं। साथ ही, उन्हें एहसास है कि तेलंगाना पुलिस विभाग तेलंगाना सरकार की ओर से काम कर रहा है ताकि यह सुनिश्चित किया जा सके कि आत्मसमर्पण करने के तुरंत बाद उन्हें वह पुरस्कार मिले जिसके वे हकदार हैं। आत्मसमर्पण करने वाले लोग तेलंगाना सरकार द्वारा प्रदान की गई सुविधाओं का आनंद लेते हुए अपने परिवार के सदस्यों के साथ शांतिपूर्ण जीवन जी रहे हैं। इस साल अब तक प्रतिबंधित माओवादी पार्टी के विभिन्न कैडर में काम करने वाले कई नेताओं और सदस्यों ने पुलिस के सामने आत्मसमर्पण किया है।
पुलिस अधीक्षक ने यह भी बताया कि इस वर्ष अब तक प्रतिबंधित कुल 265 माओवादी सदस्यों ने कोत्तागुडेम पुलिस के सामने आत्मसमर्पण किया है। इनमें डीवीसीएम-1, एसीएम-11, पीएम-29, मिलिशिया सदस्य-92, आरपीसी समिति सदस्य-33, डीएकेएम/केएमएस-47, सीएनएम सदस्य-30 और जीआरडी-22 शामिल हैं। पिछले कुछ समय से प्रतिबंधित सीपीआई माओवादी पार्टी ने आदिवासी लोगों के बीच समर्थन और विश्वास खो दिया है। अपनी पुरानी विचारधारा के साथ, एजेंसी क्षेत्र के विकास में बाधा डाल रही है और यह मान रही है कि यदि एजेंसी क्षेत्र का विकास हुआ, तो वे जीवित नहीं रह पाएंगे। वे उन जगहों पर बारूदी सुरंग लगाकर निर्दोष आदिवासी लोगों को आतंकित कर रहे हैं, जहां वे नियमित रूप से अपनी आजीविका के लिए यात्रा करते हैं। माओवादियों द्वारा पुलिस मुखबिर के नाम पर कुछ निर्दोष आदिवासियों की हत्या की जा रही है और उन्हें प्रताड़ित किया जा रहा है।
Also Read-
एसपी रोहित राजू ने कहा कि हम पार्टी के उन सदस्यों से अपील करते हैं जो आत्मसमर्पण करना चाहते हैं और सामान्य जीवन जीना चाहते हैं। वे अपने परिवार के सदस्यों के माध्यम से या व्यक्तिगत रूप से अपने निकटतम पुलिस स्टेशन या जिले के उच्च अधिकारियों से संपर्क करें। जिला पुलिस प्रशासन हमेशा यह सुनिश्चित करेगा कि आत्मसमर्पण करने वाले पार्टी सदस्यों की आजीविका और पुनर्वास के लिए सरकार की ओर से सभी प्रकार के लाभ उपलब्ध किया जाएगा। एसपी ने कहा कि यदि तेलंगाना क्षेत्र के शीर्ष माओवादी नेता मुख्यधारा में शामिल होना चाहते हैं, तो पुलिस विभाग उन्हें तुरंत विशेष नकद पुरस्कार और अन्य पुनर्वास सुविधाएं प्रदान करने के लिए तैयार है।
38 మంది మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్ : తెలంగాణలో 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ కల్పిస్తున్న పునరావాస విధానాలు, శాంతియుత జీవనంపై ఆశతో, నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట ఈ 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు పార్టీ సభ్యులు, 16 మంది మిలీషియా సభ్యులు, ఏడుగురు గ్రామ కమిటీ సభ్యులు, ఆరుగురు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ సభ్యులు, ముగ్గురు చేతన నాట్యమంచ్ సభ్యులు, నలుగురు గెరిల్లా రివల్యూషనరీ డిస్ట్రిక్ట్స్ సభ్యులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి పునరావాసం నిమిత్తం ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సహాయంగా చెక్కులను ఎస్పీ అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న ‘ఆపరేషన్ చేయూత’ వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు, మావోయిజం మార్గాన్ని వీడి, తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ కేడర్ల మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన వెంటనే వారికి అందాల్సిన ప్రతిఫలాలను తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు అందజేస్తున్నారని వారు గ్రహించారని, ఇప్పటికే లొంగిపోయిన వారు ప్రభుత్వ సౌకర్యాలను పొందుతూ తమ కుటుంబాలతో శాంతియుత జీవితం గడుపుతున్నారని వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగూడెం పోలీసుల ఎదుట 265 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు.
కొంతకాలంగా నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీ గిరిజనుల మద్దతు, విశ్వాసం కోల్పోయిందని, వారి కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఎస్పీ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తాము మనగడ సాగించలేమని వారు భావిస్తున్నారని అన్నారు. “అమాయక గిరిజనులు జీవనోపాధి కోసం నిత్యం తిరిగే ప్రాంతాల్లో ల్యాండ్మైన్లు అమర్చి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకుల దుశ్చర్యల వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు అమాయక గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్య చేస్తున్నారు, హింసిస్తున్నారు” అని రోహిత్ రాజు తెలిపారు.
జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలనుకునే పార్టీ సభ్యులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఉన్నతాధికారులను వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, నేరుగా గానీ సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన పార్టీ సభ్యుల జీవనోపాధికి, పునరావాసానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలు అందేలా జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. “తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే, వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు, ఇతర పునరావాస సౌకర్యాలు తక్షణమే అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుంది” అని ఆయన తెలిపారు. (ఏజెన్సీలు)
