హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వములో ఉత్సాహంగా కదం తొక్కి వేలాదిగా బి.ఆర్.ఎస్ శ్రేణులు కదలివెళ్ళాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల. అశోక్ మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రలో రజతోత్సవ సభ చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఈ సభతో వార్ వన్ సైడ్ అన్నటుగా బి.ఆర్.ఎస్ వైపు ప్రజలు అందగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని అన్నారు.
Also Read-

కె.సి.ఆర్ దిశా నిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాక యావత్తు భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని బి.ఆర్.ఎస్ సభల నిర్వహణలో తన రికార్డ్ తనే బ్రద్దలుకొట్టుకొని చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టిస్తుందని అన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుంది- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపు
ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదలిరావాలని సూచించారు.

పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన సభ కాబట్టి సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రణాళిక వేసుకోవాలని కోరారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలను కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని కోరారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజన వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.

తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని తెలిపారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, నేరుగా వారికి సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని మాత్రమే వాహనాలను నిలపాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీటి బాటిళ్లతోపాటు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో కేసిఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
వరంగల్, బి ఆర్ ఎస్ రజతోత్సవ సభా వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్

పెద్ద సంఖ్యలో ఎవరికి వాళ్లుగా స్వచ్ఛంగా తరలివస్తున్నారు. కెసిఆర్ గారు ఏం మాట్లాడుతారో వినాలనే ఉత్సాహం కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వమే. ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరూ రేపు జరగబోయే సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం.
ట్రాఫిక్ జామ్ చేసి సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాలంటీర్లు సమన్వయంతో ఉండాలి. అవసరం అయితే అందరం ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమైతదని నమ్మిన జయశంకర్ సార్ ది వరంగల్. వరంగల్ ప్రజలు ఎప్పుడూ బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరుతున్నాం.
రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహిస్తున్న సభ ఇది. సభ విజయవంతంగా జరిగేందుకు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం.
అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. ప్రభుత్వము, పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలి ఓపికతో, స్వీయ క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు వెళ్లాలి. సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఏదేమైనా, ప్రపంచం తలకిందులైనా ప్రతి ఒక్కరూ సభకు చేరుకోవాల్సిందే కెసిఆర్ గారి ప్రసంగం వినాల్సిందే. మరోసారి మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతిన భూనుదాము.
