Telangana MLC Elections : सीटें तीन, चुनावी जंग में 90 उम्मीदवार

हैदराबाद: तेलंगाना में तीन एमएलसी सीटों के लिए नामांकन वापस लेने की प्रक्रिया आखिरकार समाप्त हो गई है। तीन सीटों के लिए कुल 90 उम्मीदवारों ने चुनाव लड़ रहे हैं। नामांकन प्राप्त करने की अंतिम तिथि सोमवार को समाप्त हो गई, जबकि नाम वापस लेने की अंतिम तिथि गुरुवार को समाप्त हो गई। इसके साथ ही करीमनगर-मेदक-निजामाबाद-आदिलाबाद स्नातक सीटों से 12 लोगों ने नाम वापस ले लिया। इसके चलते यहां 56 लोग रह गए हैं। इसके अलावा, इसी निर्वाचन क्षेत्र के शिक्षक पद के चुनाव में एक उम्मीद ने अपना नाम वापस ले लिया। इसके चलते यहां पर 15 उम्मीदवार रह गए हैं। वहीं वरंगल-खम्मम-नल्लागोंडा शिक्षक एमएलसी सीट से तीन उम्मीदवारों ने नाम वापस ले लिया है। इस पद के लिए 19 लोग प्रतिस्पर्धा कर रहे हैं।

नामांकन की प्रक्रिया पूरी होने के साथ ही, चुनावी मैदान में उतरे उम्मीदवार अपना प्रचार अभियान तेज करने के लिए तैयार हो गये हैं। अपने-अपने जिलों में मतदाताओं से मिल चुके उम्मीदवार एक बार फिर उन्हें खुश करने के लिए रूट मैप तैयार कर रहे हैं। इसके अतिरिक्त, प्रमुख दलों के उम्मीदवार प्रमुख नेताओं को प्रचार के लिए आमंत्रित करके अपनी ताकत दिखाने की कोशिश कर रहे हैं।

सभी पार्टियों ने इस चुनाव को किसी भी कीमत पर जीतने के उद्देश्य से एक चुनौती के रूप में लिया है। बाकी बचे समय का सदुपयोग करने की दिशा में आगे बढ़ रहे हैं। इसके अलावा, संसदीय सत्र की समाप्ति और स्थानीय चुनावों के स्थगित होने के कारण चुनाव प्रचार अभियान और भी तेज होने की संभावना है। सभी राज्य स्तरीय नेता उन जिलों में जाने के लिए तैयार कर रहे हैं जहां चुनाव हैं।

MLC Elections: 3 స్థానాలు, 90 మంది అభ్యర్థులు

హైదరాబాద్ : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం మూడు స్థానాలకు గాను 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా గురువారం విత్ డ్రా గడువు పూర్తయింది. దీంతో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 12 మంది విత్ డ్రా చేసుకోగా 56 మంది పోటీలో నిలిచారు. అలాగే టీచర్ల స్థానానికి ఒకరు విత్ డ్రా చేసుకోగా 15 మంది పోటీపడుతున్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. ఈ స్థానానికి 19 మంది పోటీ పడుతున్నారు.

ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమ జిల్లాల పరిధిలోని ఓటర్లను కలుసుకున్న అభ్యర్థులు మరోసారి వారిని ప్రసన్నం చేసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారానికి కీలక నేతలను ఆహ్వానించి తమ సత్తాచాటాలని చూస్తున్నారు. ఎలా అయినా గెలవాలనే లక్ష్యంతో ఆయా పార్టీలు సైతం ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నాయి. ఉన్న కాస్త సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. అలాగే పార్లమెంట్ సమావేశాలు ముగియడం, స్థానిక ఎన్నికలు సైతం వాయిదా పడడంతో ప్రచారం మరింత జోరందుకోనుంది. రాష్ట్ర స్థాయి నాయకులంతా ఎన్నికలు ఉన్న జిల్లాల్లో మకాం వేసేందుకు సిద్ధం అయ్యారు.

‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్​రెడ్డి తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. నరేందర్ రెడ్డికి సీపీఐ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే, ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన మాజీ డీఎస్పీ మదనం గంగాధర్.. తన నామినేషన్ ఉపసంహరించుకొని కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు గ్రామాల్లో గ్రాడ్యుయేట్లను కలుస్తూ అంజిరెడ్డికి ఓటేయాలని కోరుతున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో బీజేపీ ఎక్కువగా సోషల్ మీడియాను నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. ఇకగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో బీఆర్ఎస్ ఇప్పటికీ తేల్చలేదు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు, కల్వకుంట్ల కవిత ఫొటోలతోనే ప్రచారం చేస్తున్నారు.

‘కరీంనగర్’, ‘నల్గొండ’ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీల కంటే ఉపాధ్యాయ సంఘాలే కీలకంగా మారాయి. ఈ సారి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి పోటీ చేస్తున్న మల్క కొమరయ్య, సుందర్ రాజ్ యాదవ్ లాంటి అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ‘కరీంనగర్’ టీచర్ నియోజకవర్గంలో మల్క కొమరయ్యకు బీజేపీ, తపస్ మద్దతు ప్రకటించగా యాటకారి సాయన్న బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్నారు. మిగతా అభ్యర్థులంతా ఇండిపెండెంట్లే. ఆయా టీచర్ యూనియన్ల సపోర్ట్​తో వారు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా టీపీటీఎఫ్, -యూటీఎఫ్ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్, పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, సీపీఎస్ అభ్యర్థిగా ఇన్నారెడ్డి పోటీలో ఉన్నారు. ‘నల్గొండ’ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ నర్సిరెడ్డి, పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రాజు యాదవ్, జాక్టో అభ్యర్థి పూల రవీందర్, బీజేపీ-తపస్ అభ్యర్థి సరోత్తం రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గంలో సుందర్ రాజు యాదవ్, పూల రవీందర్ బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X