ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్ధులకు శాపం
77వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ.కి ఇవ్వడానికి స్థలమే లేదా అని అంబేద్కర్ విశ్వవిధ్యాలయ పరిశోధక విద్యార్థులు రవి కుమార్, వెంకటేష్, డిగ్రీ విద్యార్ధులు అనురాధ, ఆప్రా తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ వర్శిటీ స్థలాన్ని వేరే విద్యా సంస్థలకు కేటాయించడం భావ్యం కాదన్నారు. రాష్త్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల పరిధిలో దోస్త్ ద్వారా ఇచ్చే అడ్మిషన్ల సుమారుగా రెండు లక్షలు ఉంటే, ఒక్క అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే సుమారు 50 వేలుకు పైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను గురువారం కూడా కొనసాగించారు. గత 77 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ఉపసంహరించుకోవాలంటూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read-
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. యాకేశ్ దైద; బ్రహ్మానంద నాయుడు, రుశేంద్ర మణి, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. రజిత, డా. లక్ష్మణ్, డా. కంబంపాటి యాదగిరి, షబ్బీర్; రాములు, పాండు, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.