డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుకు విదేశాల్లో భారి డిమాండ్ : జేఏసీ

ప్రత్యేక ఎడ్యుకేషనల్ లాబీటరీల అవసరం
76వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసన

హైదరాబాద్ : డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బి ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందని స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగ ఆచార్యురాలు జి. మేరీ సునంద, డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. అమెరికాలో అంబేద్కర్ వర్శిటీ బి. ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుతో అత్యంత గుర్తింపు (వైల్డ్ కార్డు ఎంట్రీలు) ఉన్నత విద్యా సంస్థల్లో పొందొచ్చని వాళ్ళు వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితిలో బి. ఎడ్, బి. ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విద్యార్థులకు మౌలిక వసుతులతో ఎడ్యుకేషనల్ లాబొరేటరీల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, యూజీసి నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలతో కనీసం నాలుగు ప్రయోగశాలలు కావాలని వివరించారు. వీటి నిర్మాణానికి అవసరమైన స్థలం యూనివర్సిటీ లో అందుబాటులో లేదని, నిధుల కొరత ఉందని ఇలాంటి సమయంలో వేరే విద్యా సంస్థలకు యూనివర్సిటీ స్థలాన్ని కేటాయించడం భావ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను బుధవారం కూడా కొనసాగించారు. గత 76 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇది కూట చదవండి-

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. ఎల్వికే రెడ్డి, డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. ప్రమీల కేతావత్, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. రజిత, షబ్బీర్; అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X