हैदराबाद : हॉस्टल प्रबंधन गिरोह ने एक युवक पर हमला किया। पीड़ित युवक और पुलिस के अनुसार, पालनाडु (आंध्र प्रदेश) जिले के पेदकुरपाडु गांव निवासी सैयद आसिफ अपनी बीटेक की पढ़ाई पूरी करने के बाद शहर आया और एसआर नगर में श्री बालाजी बॉयज हॉस्टल में रहकर कंप्यूटर कोर्स की पढ़ाई कर रहा था।
रविवार को उसके गांव का एक दोस्त जहीर (निजी कर्मचारी) उससे मिलने आया। जहीर ने हॉस्टल के वॉशरूम में मुंह धोया। जब दोस्त आसिफ और जहीर हॉस्टल से बाहर आ रहे थे तो हॉस्टल के मैनेजर से यह कहकर बहस हो गई कि वे उसे अंदर क्यों लेकर आया। हॉस्टल के मैनेजर ने भला बुरा कहते हुए उसके साथ दुर्व्यवहार किया और उसके मां के नाम पर गाली दी।
आसिफ उनसे सवाल किया कि उन्होंने उसकी मां के नाम पर क्यों गाली दी है। इससे गुस्साए हॉस्टल मैनेजर और उसके परिवार के लोगों ने आसिफ पर हमला कर दिया। बीच सड़क पर सबके सामने युवक की पिटाई कर दी। इससे स्थानीय लोग भयभीत हो गये। आसिफ वहां से भाग निकला और एसआर नगर पुलिस में शिकायत दर्ज कराई। पीड़ित की शिकायत पर पुलिस मामला दर्ज कर जांच कर रही है।
ఎస్ ఆర్ నగర్ లో యువకుడి పై హాస్టల్ నిర్వాహకుల దాడి
హైదరాబాద్ : యువకుడి పై హాస్టల్ నిర్వాహకులు మూక్కుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం పల్నాడు (ఆంధ్రప్రదేశ్) జిల్లా పెదకూరపాడుకు చెందిన సయ్యద్ అసిఫ్ బీకెట్ పూర్తి చేసుకుని నగరానికి వచ్చి ఎస్ఆర్ నగర్ లోని శ్రీ బాలాజీ బాయిస్ హాస్టల్ ఉంటూ కంప్యూటర్ కోర్సు నెర్చుకుంటున్నాడు.
కాగా ఆదివారం తనను కలిసేందుకు తన స్వగ్రామం నుంచి స్నేహితుడైన జహీర్ అనే ప్రైవేటు ఉద్యోగి వచ్చాడు. హాస్టల్లోని వాష్ రూమ్ లో జహీర్ ముఖం కడుకున్నాడు. స్నేహితులు ఆసిఫ్, జహీర్లు హాస్టల్ నుంచి బయటకు వస్తుండగా హాస్టల్ నిర్వాహకుడు లోపలికి ఎందుకు తీసుకుని వచ్చావ్ అంటూ వాగ్వివాదానికి దిగి హాస్టల్ నిర్వాహకుడు దుర్బాషలాడి తల్లి పేరుతో తీవ్ర పదజాలంతో దూషించాడు.
తన తల్లిని ఎందుకు తిట్టావని ఆసిఫ్ వారిని ప్రశ్నించాడు. ఆవేశానికి లోనైన హాస్టల్ నిర్వాహకుడు, అతని కుటుంబీకులు మూకుమ్మడిగా ఆసీఫ్ పై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డు పై అందరి ముందు యుకుడ్ని పట్టుకుని చితకబాదుతుంటే అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆసిఫ్ ఎస్.ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)