हैदराबाद: पिछले कुछ दिनों से करीमनगर जिले में बछड़ों को मारकर लोगों को आतंकित कर रहा चीता आखिरकार वन विभाग के अधिकारियों द्वारा लगाए गए पिंजरे में फंस गया है।
पिछले कुछ हफ्तों से यह करीमनगर जिले के कोत्तापल मंडल के नंदीगामा, दुप्पटीगट्टू, गोकुल नगर और गोरलोनी बावी के आसपास घूम रहा था और लोगों को परेशान कर रहा था। इसके साथ ही स्थानीय लोगों ने इसकी सूचना वन अधिकारियों को दी। अधिकारियों ने बछड़ों के पदचिह्न और चीता के पैरों के निशान एकत्र किए और इसकी पहचान तेंदुए के रूप में की गई।

सोमवार रात को नंदीगामा के आसपास के इलाकों में एक तेंदुआ पाया गया और वन विभाग अधिकारी लक्ष्मण के निर्देशन में एक पिंजरा लगाया गया। आख़िरकार चीता के पिंजरे में फंसा गया। इसके चलते लोगों ने राहत की सांस ली। इस बीच, वन विभाग के अधिकारियों ने कहा कि पिंजरे में फंसे चीते को सुरक्षित इलाकों में ले जाया जाएगा।
संबंधित खबर-
शमशाबाद हवाईअड्डे पर तेंदुआ पकड़ा गया
दूसरी ओर, शमशाबाद हवाईअड्डे पर तेंदुए को पकड़ने के लिए वन अधिकारियों को पांच दिनों तक मेहनत करनी पड़ी। तेंदुए ने छह दिनों तक अधिकारियों को परेशान कर रखा था। यह तेंदुआ अचानक एयरपोर्ट रनवे पर आ गए था। तेंदुए को पकड़ने के लिए वन पुलिस और सीआईएसएफ अधिकारियों ने कड़ी मेहनत की। आखिरकार चीता के पिंजरे में फंसने पर सभी ने राहत की सांस ली। चीते को पकड़ने के लिए पांच पिंजरे और 20 सीसी कैमरे लगाए गए थे। हालाँकि बकरियों को पिंजरे में रखा गया था, लेकिन वह फँसा नहीं था। मालूम हो कि चीता पिंजरे के पास कई बार गया और वापस चला गया।
लेकिन शुक्रवार की सुबह दो बजे बकरी को खाने के लिए पिंजरे के पास पहुंचा और फंस गया। इसके चलते सभी ने राहत की सांस ली। चीता को नेहरू चिड़ियाघर में स्थानांतरित किया जाएगा। वहां पर चिड़ियाघर के अधिकारी मेडिकल परीक्षण करेंगे और उन्हें एक दिन के लिए निगरानी में रखेंगे। वन विभाग के अधिकारियों ने कहा कि वे तेंदुए को नल्लामाला जंगल में छोड़ देंगे। पिछले 28 अप्रैल को चीता गोलापल्ली से सुरक्षा दीवार फांदकर शमशाबाद हवाईअड्डे में घुस गया था। कूदते समय, प्रहरी बिजली की बाड़ के तारों से टकरा गया और हवाई अड्डे के नियंत्रण कक्ष में अलार्म बज गया। इससे घबराए एयरलाइन स्टाफ ने इसकी सूचना वन विभाग के अधिकारियों को दी। मालूम हो कि चीतों को पकड़ने के लिए पांच पिंजरे, 20 सीसी कैमरे और बकरियों की व्यवस्था की गई थी।
Big Relief : ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా లేగ దూడలను హతమారుస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ వచ్చిన చిరుత పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్ మండల పరిధిలోని నందిగామ, దుప్పటి గట్టు, గోకుల్ నగర్, గొర్లోని బావి పరిసరాలలో గత కొన్ని వారాలుగా సంచరిస్తూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తూ వస్తోంది. దీనితో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. లేగ దూడలను హతమార్చిన విధానాలు, పాదముద్రలను సేకరించిన అధికారులు అది చిరుతపులిగా గుర్తించారు.
సోమవారం రాత్రి నందిగామ పరిసర ప్రాంతాలలో చిరుత ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో బోను ఏర్పాటు చేశారు. ఎ ట్టకేలకు చిరుత బోనులో చిక్కడెంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బోనులో చిక్కిన చిరుతను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
మరోవైపు, ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఐదు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆరు రోజులపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత. ఏకంగా ఏర్పోర్ట్ రన్ వే మీదికి వచ్చింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు బోన్ లో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిరుత కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేకలను బోనుల్లో ఉంచినప్పటికీ అది చిక్కుకోలేదు. పలుమార్లు బోను దగ్గరికి వెళ్లిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేకను తినేందుకు బోను వద్దకు వెళ్లిన చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో జూ అధికారులు ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో అటవీ శాఖ అధికారులు చిరుతను వదిలేస్తామని తెలిపారు. గత ఏప్రిల్ 28 ఉదయం గొల్లపల్లి నుంచి భద్రతా గోడ దూకి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత ప్రవేశించింది. దూకుతున్న సమయంలో ప్రహరీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు తగిలి ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత కోసం పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు, మేకలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)