हैदराबाद: तेलंगाना में भारी बारिश हो रही है। हैदराबाद शहर में भी रात से भारी जारी है। मौसम विज्ञान केंद्र ने चेतावनी दी है कि गुरुवार तक भारी बारिश की संभावना है। लोगों को सतर्क रहने का आदेश दिया गया है। पाटनी, तिरुमलगिरी, अलवाल, पैराडाइज, बेगमपेट, बोइनपल्ली, मारेडपल्ली, चिलकलगुडा और कई अन्य स्थानों पर पहले से ही भारी बारिश हो रही है।
इसी क्रम में भद्राचलम के पास गोदावरी नदी खतरे के निशान से ऊपर बह रही है। इसके चलते अधिकारियों ने तीसरे नंबर की चेतावनी जारी की है। तेलंगाना में लगभग सभी नदी नालों में भयंकर बाढ़ आ गई है। अनेक गांवों का संपर्क टूट गया है।
హైదరాబాద్లో రాత్రంతా వాన, హెచ్చరించిన వాతావరణశాఖ
హైదరాబాద్: తెలంగాణలో రాత్రిపూట భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే ప్యాట్నీ, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, బేగంపేట్, బోయినపల్లి, మారేడ్పల్లి, చిలుకలగూడతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
ఈ క్రమంలో భద్రాచలం సమీపంలోని గోదావరి నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని దాదాపు అన్ని నదీ పరివాహక ప్రాంతాలలో తీవ్ర వరదలు ఉన్నాయి. చాలా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.