హిందూ శక్తిని చాటేందుకు ‘హిందూ ఏక్తా యాత్ర’, రేపు జగిత్యాల బంద్

  • లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం
  • కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర
  • అసోం సీఎంతోపాటు ఏక్తా యాత్రకు రానున్న కేరళ స్టోరీ యూనిట్
  • జగిత్యాల ఎస్ఐ, ఆయన భార్య చేసిన తప్పేంటి?
  • ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా?
  • పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తే ఎస్ఐ, ఆయన కుటుంబ సభ్యులపైనే తిరిగి కేసు పెడతారా?
  • సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారుతున్నా పట్టించుకోరా?
  • రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నాం
  • బీఆర్ఎస్ నేతల హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్వాగతిస్తున్నా
  • సచివాలయంలో హిందూ ఆలయానికి రెండున్నర గుంటల జాగా ఎందుకిచ్చారు?
  • మసీదు కోసం 5 గుంటల జాగా ఎందుకిచ్చారో సీఎంను నిలదీసే దమ్ముందా?
  • పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య తీవ్రంగా కలిచి వేసింది
  • ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ హత్యే
  • ప్రభుత్వ వేధింపులు తాళలేకే సోనీ ఆత్మహత్య
  • ఎవరూ ఆత్మహత్య చేసుకోకండి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తోపాటు ‘‘కేరళ స్టోరీ’’ సినిమా యూనిట్ హిందూ ఏక్తా యాత్రకు రాబోతోందని చెప్పారు. తెలంగాణలో హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హేళన చేస్తున్న కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర నిర్వహించబోతున్నామని, హిందువులంతా స్వచ్ఛందంగా హాజరై సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

రేపు జగిత్యాల బంద్

ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్ఐని సస్పెండ్ చేయడంతోపాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం నాయకులు బెదిరింపులకు తలొగ్గి ఎస్ఐని సస్పెండ్ చేసి కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యగానే అభివర్ణించారు.

ఈరోజు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈనెల 14న జరగబోయే హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

• రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, కుహానా లౌకిక వాదుల పేరుతో కొన్ని పార్టీల నాయకులు హిందువులను హేళన చేస్తూ చులకన భావనతో చూస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని హిందువులందరినీ సంఘటిత శక్తిగా చేసేందుకు ఈనెల 14న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నాం.

• కర్నాటకలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణలో పోటీ పడి కొన్ని పార్టీలు హిందువులను హేళన చేస్తున్నాయి. అందుకే హిందూ ధర్మ రక్షణ గురించి ఆలోచించే యువకులు, ప్రజలంతా కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి నిర్వహించే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని ప్రదర్శించాలని కోరుతున్నా. హిందువులను కించపరిచే వాళ్లకు గుణ పాఠం చెప్పేలా సత్తా చాటుదాం. దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

• హిందూ ఏక్తా యాత్రకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తోపాటు ‘‘కేరళ స్టోరీ’’ డైరెక్టర్ తోపాటు సినిమా యూనిట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో హిందూ ఏక్తా యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నా.

• నిన్న జగిత్యాలలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎస్ఐ అనిల్ కుమార్ భార్య ఇద్దరు పసిపిల్లలతో కలిసి బస్ ఎక్కితే చిన్న కొడుకుకు పాలు ఇవ్వడానికి సీటు అడిగితే… పక్కనే ఉన్న బుర్ఖా వేసుకున్న మహిళ సీటు ఇవ్వకుండా ఇష్టానుసారం బూతులు తిడుతూ గొడవ పెట్టుకునే యత్నం చేయడం బాధాకరం. అంతేగాకుండా వాళ్ల మనుషులకు ఫోన్ చేసి రప్పించుకునే యత్నం చేస్తే భయపడ్డ ఎస్ఐ భార్య ఫోన్ చేసి రావాలని చెబితే అక్కడికి వచ్చిన ఎస్ఐ అనిల్ గొడవను సద్దుమణిగించే యత్నం చేస్త్తే కావాలని రెచ్చగొట్టి గొడవ చేసి తనపైనే దాడి చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేయడం బాధాకరం. ఎస్ఐ దాడి చేసిన దాఖలాల్లేవు. కనీసం విచారణ చేయకుండానే అమాయకుడైన ఎస్ఐని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం?

• ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి భార్య ఇద్దరు పసిపిల్లలతో ఎండా కాలం బస్సులో ప్రయాణిస్తోందంటేనే సదరు ఎస్ఐ ఎంతటి నిజాయితీపరుడో, అర్ధం చేసుకోవాలి. సిగ్గులేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ఐ, ఆయన భార్యపైన, కానిస్టేబుల్ పైన కేసు పెట్టడం సిగ్గు చేటు.

• పైగా ఎంఐఎం నాయకులు జగిత్యాల వచ్చి అక్కడే ఉండి ఎస్ఐపైన, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టించడం దారుణం. ఎస్ఐ గా కాకుండా తన భార్యను కాపాడుకునే ప్రయత్నం కూడా చేయకూడదా? భార్యను తిడుతుంటే కనీసం అడ్డుకోకూడదా? బురఖ వేసుకున్న మహిళ ఫిర్యాదు చేస్తే అదో పెద్ద నేరంగా చూసి సస్పెండ్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి లోపలేయకుండా… తిరిగి ఎస్ఐపైనే కేసులు పెట్టడం దుర్మార్గం. భర్త డ్యూటీ చేయడమే తప్పా? దీనిని మతం కోణంలో చూసి ఇబ్బంది పెడతారా?

• పాతబస్తీలో కరెంట్ బిల్లులు అడిగితే దాడి చేసినా పట్టించుకోరు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన పట్టించుకోరు. పోలీసులపై దాడి చేసినా స్పందించరు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?

• జగిత్యాల సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ వాగుతున్నరు. పోలీస్ స్టేషన్ పై దాడులు చేస్తున్నరు. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నా పట్టించుకోరు. రేపటి నుండి జగిత్యాలపై ప్రత్యేక ద్రుష్టి పెడతాం… వాళ్ల సంగతి చూస్తాం. నిన్న జరిగిన ఘటనకు నిరసనగా రేపు జగిత్యాల బంద్ కు బీజేపీ పిలుపునిస్తోంది. అందరూ సహకరించాలని కోరుతున్నా.

• పోలీస్ సంఘం ఏం చేస్తోంది? మీ సంఘ సభ్యుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరెందుకు మెదపడం లేదు? తన ముందే భార్యను క్షోభకు గురిచేస్తుంటే ఆ ఎస్ఐ మానసిక వేదనను అర్ధం చేసుకోరా? తక్షణమే ఎస్ఐపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలి. కేసులను ఉపసంహరించుకోవాలి. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.

• కొద్దిసేపటి క్రితం నర్సంపేటకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉరేసుకోవడం నన్ను కలిచివేస్తోంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాల్లో చేరితే 4 ఏళ్లు చాకిరి చేయించుకుని రెగ్యులరైజ్ చేయకపోవడం సిగ్గు చేటు. వాళ్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చూపే కుట్ర చేస్తుంటే గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. దీంతో ఇక తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలనే ఆందోళనతో సోనీ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చుకోకపోవడంవల్లే ఆమె చనిపోయింది. ‌దయచేసి ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకండి. మీరు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు.. మీ తరపున కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది 5 నెలలే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు అన్ని బెన్ ఫిట్స్ ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. చనిపోయిన సోని కుటుంబాన్ని ఆదుకుంటాం.

• హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు. ఆ మార్పు కోసమే మేం చేస్తున్నాం. అయితే 80 శాతం ఉన్న హిందువుల కోసం సచివాలయంలో నల్ల పోచమ్మ గుడి కోసం రెండున్నర గుంటల జాగా మాత్రమే ఎందుకిచ్చారు? ఇతర వర్గాల మసీదు కోసం 5 ఎకరాల జాగా ఎందుకిచ్చారో వారంతా సీఎంను నిలదీయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X