“ఒక పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం నా పేరిట బంద్”

పట్టణ బంద్ తో నాకు సంబంధం లేదు

నాపై ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటా

సస్పెన్షన్కు గురైన ఎస్సై అనిల్ కుమార్ వెల్లడి

హైదరాబాద్: కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని సస్పెన్షన్ గురైన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. ఒక పార్టీ తలపెట్టిన పట్టణ బంద్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

ఆయన మాట్లాడుతూ….గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పని చేస్తున్నానని, ఎటువంటి కల్మషాలు లేకుండా శాంతి భద్రత పరిరక్షణకు నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు.

ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల రీత్యా క్రమశిక్షణ చర్యల మీద పోలీసు నియమ నిబంధల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటానని అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, ఒక వర్గానికి చెందిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు:

వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అలా చేస్తున్నారని స్పష్టం చేశారు. తన పేరిట శనివారం రోజున బందుకు పిలుపునిచ్చినట్లు తనకు తెలిసిందని, ఆ బందుకు తనకు ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు.

బంద్ పాటించి ప్రజలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు చట్టంపై మరియు పై అధికారులపై విశ్వాసం ఉందని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కాబట్టి అధికారులు విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని భావిస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X