Welcome : प्रधानमंत्री नरेंद्र मोदी का दौरा, हैदराबाद में यातायात प्रतिबंध, छात्रों को एक घंटा पहले परीक्षा केंद्र पहुंचने का सुझाव

हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी शनिवार को हैदराबाद का दौरा करेंगे। इसी पृष्ठभूमि में, पुलिस ने सिकंदराबाद के आसपास यातायात प्रतिबंध लगा दिया। प्रधानमंत्री सिकंदराबाद रेलवे स्टेशन पर वंदे भारत एक्सप्रेस के उद्घाटन कार्यक्रम में भाग लेंगे और उसके बाद परेड ग्राउंड में जनसभा को संबोधित करेंगे। नतीजतन, सिकंदराबाद क्षेत्र में शनिवार को सुबह 9 बजे से दोपहर 2.30 बजे तक यातायात प्रतिबंध लागू रहेगा। कई रास्ते पूरी तरह बंद रहेंगे। वाहनों को अन्य स्थानों पर डायवर्ट किया गया है।

मोनप्पा (राजीव गांधी की मूर्ति) जंक्शन, ग्रीन लैंड्स, प्रकाशनगर, रसूलपुरा सीटीओ, फ्लाजा, एसबीएच, वाईएमसीए, सेंट जॉन रोटरी, संगीत एक्स रोड, आलुगड्डाबावी, चिलकलगुडा जंक्शन, एमजे रोड, आरपी रोड, एसपी रोड सबसे भीड़भाड़ वाले मार्ग हैं, इन जंक्शनों की ओर न जाने की सलाह दी गई है। पुलिस ने कहा कि सिकंदराबाद रेलवे स्टेशन जाने वालों को ट्रैफिक जाम को ध्यान में रखते हुए जल्दी स्टेशन पहुंचना चाहिए। उप्पल-सिकंदराबाद मार्ग पर भी यातायात की भीड़ होगी और वैकल्पिक मार्ग लेने की सलाह दी गई है।

इस बीच प्रधानमंत्री मोदी के दौरे के मद्देनजर यातायात प्रतिबंध लागू रहेगा। इसके साथ ही अधिकारियों ने सुझाव दिया कि 10वीं कक्षा के परीक्षा केंद्रों पर जाने वाले छात्र-छात्राएं एक घंटे पहले अपने केंद्रों पर पहुंच जाएं। ट्रैफिक में फंसने पर परीक्षा में देर होने का खतरा रहता है, इसलिए छात्र व अभिभावक परीक्षा केंद्रों पर एक घंटे पहले पहुंचना सुनिश्चित कर लें। इसी तरह, डीजीपी अंजनी कुमार ने उम्मीदवारों को सलाह दी कि वे जल्द से जल्द अपने परीक्षा केंद्रों पर पहुंचें क्योंकि एसएससी और एएससी की परीक्षाएं हैं।

ప్రధాని నరేంద్ర పర్యటన, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రధాని పాల్గొంటారు. దీంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రోడ్లను పూర్తిగా మూసివేయనున్నారు. మరికొన్ని చోట్ల వాహనాలను దారిమళ్లించనున్నారు.

మోనప్ప (రాజీవ్‌ గాంధీ విగ్రహం) జంక్షన్‌, గ్రీన్‌ లాండ్స్‌, ప్రకాశ్‌నగర్‌, రసూల్‌పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్‌బీహెచ్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్‌, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ రూట్లు, జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఉప్పల్‌-సికింద్రాబాద్‌ రూట్‌లో సైతం ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.

కాగా, ప్రధాని మోదీ పర్యటన ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దీంతో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల‌కు వెళ్లే విద్యార్థులు ఒక గంట ముందే త‌మ సెంట‌ర్లకు చేరుకోవాల‌ని అధికారులు సూచించారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఎగ్జామ్‌కు ఆల‌స్యం అయ్యే ప్ర‌మాదం ఉంటుంది కాబ‌ట్టి.. గంట ముందే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకునేలా విద్యార్థులు, త‌ల్లిదండ్రులు అప్రమ‌త్తం కావాల‌న్నారు. అదేవిధంగా ఎస్సై, ఏఎస్సై పరీక్షలు ఉన్నందువల్ల అభ్యర్థులు వీలైనంత తొందరగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‌ సూచించారు. (ఏజెన్సీలు)

ట్రాఫిక్‌ ఆంక్షలు

  • టివోలి ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఫ్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు ఇరువైపుల మూసేస్తారు.
  • ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి స్వీకార్‌.. ఉపకార్‌ జంక్షన్‌ వరకు ఇరువైపుల రోడ్డు మూసేస్తారు.
  • చిలకలగూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలకు అనుమతి ఉండదు. ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు అఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ రూట్‌ను ఉపయోగించుకొని సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాలి.
  • కరీంనగర్‌ వైపు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా నగరంలోకి వచ్చే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
  • కీసర ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
  • తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
  • కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ రూట్లలో వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X