హైదరాబాద్ : నాలుగున్నర లక్షల మంది పదో తరగతి విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తూ ఎంపీగా, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్ స్వయంగా పదో తరగతి ప్రశ్నపత్రాలను లీక్ కుట్రలో పాల్గొని దొరికిపోయిన నేపథ్యంలో వనపర్తి అంబేద్కర్ చౌరస్తా లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసిన వనపర్తి బీఆర్ఎస్ పార్టీ.
కేవలం ప్రభుత్వాన్ని బద్ నాం చేసి రాజకీయ లబ్ది పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ తెలంగాణ మీద చేసిన కుట్రలను ప్రజలు గమనించాలని, కుట్రదారులను కఠినంగా శిక్షించాలని, బండిని బీజేపీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.