ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళనంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

Also Read-

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు,మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar