अभिनेता विष्णु मंचू और मंचू मनोज के बीच विवाद… अभिनेता मोहन बाबू की है यह प्रतिक्रिया

हैदराबाद: टॉलीवुड हीरो मंचू मोहन बाबू के बेटे टॉलीवुड हीरो विष्णु मंचू और मंचू मनोज के बीच सालों से चला आ रहा झगड़ा अब चरम पर पहुंच गया है। मोहन बाबू के दोनों बेटे मिलजुल कर रहते थे, मगर कुछ सालों से दोनों में दूरी बढ़ती गई हैं।

హీరోలు విష్ణు మంచు, మంచు మ‌నోజ్ మ‌ధ్య గొడ‌వ‌లు… మోహ‌న్ బాబు రియాక్ష‌న్‌

హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మంచు మోహ‌న్ బాబు త‌న‌యులు, టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు, మంచు మ‌నోజ్ మ‌ధ్య ఇన్నాళ్లు స్త‌బ్దుగా ఉన్న గొడ‌వ‌లు రోడ్డున ప‌డ్డాయి. మోహ‌న్ బాబు కొడుకులుగా క‌లిసి మెలిసి ఉండే వీళ్ల మ‌ధ్య కొన్నాళ్లుగా దూరంగా పెరిగింద‌నే చెప్పాలి.

రీసెంట్‌గా జ‌రిగిన మంచు మ‌నోజ్ పెళ్లి, మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే ఇదిప్పుడు గాలివాన‌గా మారింది. విష్ణు మంచు తన ఇంట్లో ప‌ని చేసే సార‌థి అనే వ్య‌క్తిపై దాడి చేసే దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను మంచు మ‌నోజ్ ఏకంగా త‌న ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయ‌టం హాట్ టాపిక్‌గా మారింది. స‌ద‌రు వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది.

అయితే వెంట‌నే ఈ గొడ‌వ‌ను స‌ర్దుబాటు చేయ‌టానికి మంచు మోహ‌న్ బాబు రంగంలోకి దిగారు. ఆయ‌న ఇద్ద‌రు కొడుకుల‌పై సీరియ‌స్ అయ్యారు. అంతే కాకుండా కుటుంబంలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌టంపై కూడా ఆయ‌న ఆగ్రహాన్ని వ్య‌క్తం చేయ‌టంతో వెంట‌నే మ‌నోజ్ ఫేస్ బుక్‌లో పెట్టిన వీడియోను డిలీట్ చేశారు.

ఇప్పుడు ఈ వివాదంపై మోహ‌న్ బాబు స్పందించారు. కుటుంబం, అన్న‌ద‌మ్ములు అన్న త‌ర్వాత చిన్న చిన్న గొడ‌వ‌లుండ‌టం సాధార‌ణ విష‌య‌మ‌ని, ఆవేశం అన‌ర్థానికి దారి తీస్తుంద‌నే విష‌యాన్ని త‌న కొడుకులు అర్థం చేసుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న తెలిపారు. కాబట్టి వివాదాన్ని పెద్ద‌గా చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు.

కుటుంబంలో గొడ‌వ‌లు ఉండ‌టం కామన్‌గానే ఉంటాయి. అయితే దీనికి సోష‌ల్ మీడియా వ‌ర‌కు ఎందుకు ఎక్కాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న సీరియ‌స్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు మంచు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మేంట‌నేది క్లియ‌ర్‌గా తెలియ‌టం లేదు. అయితే సార‌థి అనే వ్య‌క్తి కార‌ణంగానే ఈ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌నే మాట గ‌ట్టిగా వినిపిస్తుంది.

మోహ‌న్ బాబుకు సార‌థి అనే వ్య‌క్తి త‌మ్ముడు వ‌రుస అవుతాడు. విష్ణు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పటి నుంచి త‌న‌కు సార‌థి ద‌గ్గ‌ర‌గా ఉండేవాడు. త‌ర్వాత మోహ‌న్ బాబుకే ద‌గ్గ‌ర‌య్యాడు. కొన్నాళ్లుగా మంచు మ‌నోజ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారట‌. అయితే స‌ద‌రు సార‌థి అనే వ్య‌క్తి ఏం చేశాడు. దానికి మంచు విష్ణు అంత సీరియ‌స్ ఎందుక‌య్యాడ‌నేది మాత్రం ఇంకా తెలియ‌టం లేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X