The Invitation: ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక 42వ జాతీయ స్థాయి అవార్డు-2022

విజయవాడ: ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక తాము అందించే 42వ జాతీయ స్థాయి అవార్డు- 2022 కొరకు వచన కవితలకు ఆహ్వానం పలుకుతోంది.

  • కవితా వస్తువు. పరిధి విషయాల్లో కవికి పూర్తి స్వేచ్ఛ.
  • కవిత సామాజిక వర్తమాన స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండాలి.
  • రెండు కవితలు మించి పంపరాదు పంపినచో వారి కవితలు పరిశీలించ బడవు.
  • కవిత ఎక్స్ రే అవార్డుకోసం ప్రత్యేకించి రాసినదై ఉండాలి.
  • కవిత 2 పేజీలకు మించి ఉండరాదు. సుదీర్ఘ కవితలు పరిగణనలోకి తీసుకోబడవు.
  • పేరు, చిరునామాలను ‘కవిత’ పైన కాకుండా హామీ పత్రంలో మాత్రమే రాయాలి.
  • ప్రవేశ రుసుము రూ.100/-ఎం.ఓ. ద్వారా పంపాలి. డిడి లేదా చెక్ ద్వారా పంపదలిస్తే రూ.125/-లు పంపాలి.
  • అత్యుత్తమ కవితకు, అవార్డుగా రూ. 10,000/-ల నగదుతో పురస్కారం.
  • మరో పది కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలు.
  • అవార్డు గ్రహీతలు బహుకరణ సభకు స్వయంగా వచ్చి అవార్డును స్వీకరించాలని.

గడువు తేది: 31 డిశంబర్ 2022 అని, తుది నిర్ణయం ఎక్స్ రే దే నని,
కవితలు, ప్రవేశ రుసుము పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక
పోస్ట్ బాక్స్ నెం. 340, కొల్లూరి టవర్స్, దాసువారి వీధి, అరండల్ పేట, విజయవాడ-520002, ఆంధ్రప్రదేశ్
అవసరమైనవారు ఫోన్ నెంబర్: 0866-24342236, 9848448763, 9491298990 లలో సంప్రదించవచ్చని
ఎడిటర్ కొల్లూరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X