हैदराबाद: फिल्म अभिनेता मांचू मनोज और भूमा मौणिका परिणय सूत्र में बंध गए। मनोज और मौणिका की शादी शुक्रवार रात को धूमधाम से संपन्न हुई। मनोज और मौणिका की शादी फिल्मनगर में मंचू लक्ष्मी के घर पर अपने दोनों परिवारों और करीबी दोस्तों की मौजूदगी में हुई।
वैदिक मंत्रोच्चार के बीच हुए इस विवाह समारोह में दोनों परिवारों के सदस्य और करीबी रिश्तेदार ही शामिल हुए और नवविवाहितों को आशीर्वाद दिया। शुक्रवार सुबह मनोज ने सोशल मीडिया पर अपनी फोटो शेयर करते हुए कहा, ‘दुल्हन भूमा मौणिका’।
సినీ నటుడు కన్నుల పండువగా మంచు మనోజ్ పెళ్లి
హైదరాబాద్ : సినీ నటుడు మంచు మనోజ్ మరియు భూమా మౌనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి మనోజ్మరియు మౌనిక వివాహం ఘనంగా జరిగింది. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు.
వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం ఉదయమే ‘పెళ్లికూతురు భూమా మౌనిక’ అంటూ ఆమె ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు మనోజ్. (ఏజెన్సీలు)