యాత్ర ఫర్ ఛేంజ్: కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధం

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

[Note : 20వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఈరోజు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర. ఉదయం 8 గంటలకు శ్రీపాద 9వ ప్యాకేజ్ సందర్శన. ఉదయం 10:30 గంటలకు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జఫర్ సంఘాలతో సమావేశం. మధ్యాహ్నం 1 గంటలకు భోజన విరామం. సాయంత్రం 4:30 గంటలకు పద్మానగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం. సిరిసిల్ల పట్టణం వరకు కొనసాగనున్న యాత్ర. రాత్రి 7గంటలకు సిరిసిల్ల నేతన్న చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రారం మండలం సంకపల్లిలో రాత్రి బస]

హైదరాబాద్ : “కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు సన్నాసులు అడుగుతున్నారు. జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, బీమా,ఎస్ఆర్ఎస్ పీ ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్. ఈ వేదికగా బీఆరెస్ నేతలకు సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే 2004 నుంచి 2014 వరకు మేమేం చేశామో…2014 నుంచి 2023 వరకు మీరేం చేశారో చర్చించడానికి సిద్ధమా? డ్రామారావు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామం కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిందే” అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని మన్యంపల్లి నుంచి మానకొండూరు వరకు పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. కరీంనగర్ గడ్డకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అనే ప్రకటించారు. రాజకీయంగా నష్టం జరిగిన మాట ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ గారు తెలంగాణ కలను సాకారం చేశారు. మాట తప్పక.. మడమ తిప్పక తెలంగాణ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. కానీ కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఇచ్చిన మాట తప్పుతూనే ఉన్నాడు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అంటూ కేసీఆర్ ప్రజల్ని నమ్మించి మోసం చేశారు.

రసమయిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీసమస్యలపై కొట్లాడలేదు. దొరలకంటే తానేం తక్కువ కాదని ఫామ్ హౌస్ కట్టుకుండు. అక్రమాలను ప్రశ్నించినవారిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఎమ్మెల్యే వల్ల దళిత బిడ్డ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు. పరాయి వాడు కాబట్టే.. ఇక్కడి ప్రజలపై కేసులు పెడుతుండు. మానకొండూర్ తో ఎమ్మెల్యే రసమయి కి పేరు బంధం లేదు, పేగు బంధం లేదు. అందుకే ఈ ప్రాంతాన్ని దోచుకు తింటున్నాడు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను గుంజుకుని ఈ ప్రభుత్వం దళిత, గిరిజనుల ఉసురు పోసుకుంటోంది. రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు సన్నాసులు అడుగుతున్నారు.

జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, బీమా,ఎస్ఆర్ఎస్ పీ ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్. ఈ వేదికగా బీఆరెస్ నేతలకు సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే 2004 నుంచి 2014 వరకు మేమేం చేశామో…2014 నుంచి 2023 వరకు మీరేం చేశారో చర్చించడానికి సిద్ధమా? డ్రామారావు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామం కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిందే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అంటే.. రెండుసార్లు అవకాశం ఇచ్చారు. అరవయ్యేళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. అందుకు మీ ఆశీర్వాదం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు అందిస్తాం.ఆరోగ్యశ్రీ ద్వారా పేదల వైద్యానికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం.కొత్త ప్రభుత్వంలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. ధరణి దందాలపై విచారణ చేపట్టి.. ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి.

రాహుల్ సందేశం చేరవేసేందుకే జోడో యాత్ర: మాణిక్ రావ్ ఠాక్రే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్

తెలంగాణలో ప్రజా సమస్యలు తెకుసుకుంటూ రేవంత్ రెడ్డి గత 20 రోజులుగా యాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ సందేశాన్ని చేరవేసేందుకు ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. తెలంగాణ ఏర్పాటు కోసం పొన్నం ఎంతో కృషి చేశారు. తెలంగాణలో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీఆరెస్ పై కాంగ్రెస్ పోరాడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X