తెలంగాణ మైనార్టీస్ కమిషన్ నూతన ఛైర్మన్ తారిఖ్ అన్సారీకి మంత్రి వేముల శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ నూతన ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మినిస్టర్ క్వార్టర్స్ లోని అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు సహకరించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా తారిక్ అన్సారీ కి మంత్రి వేముల పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్ తినిపించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నిజామాబాద్ కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన తారిఖ్ అన్సారీ ని ముఖ్యమంత్రి కెసీఆర్ మైనార్టీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేసిఆర్ గారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తారీక్ అన్సారీ వెంట ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X