ऑनर किलिंग : डीजे हरीश की हत्या में क्या हुआ

हैदराबाद : हर कोई मान-प्रतिष्ठा से जीवन जाना में चाहता है। सबको सम्मान से जीना भी है और चाहिए भी। इससे ऊपर कोई नहीं है। लेकिन कुछ बुजुर्ग मर्यादा (सम्मान) के लिए अपनी मर्यादा खो रहे हैं। पलक झपकते लिए जा रहे फैसलों से जेल के सलाखों के पीछे धकेले जा रहे हैं। हाल ही में हैदराबाद में एक युवक की बेरहमी से हत्या कर दी गई थी। लड़की के परिजनों ने अपनी बेटी से शादी करने के लिए नाराज होकर युवक की हत्या कर दी।

ग्रेटर हैदराबाद में ऑनर किलिंग के ताजा मामले ने सभी को हैरान कर दिया है। माता-पिता की नजर में यह अक्षम्य अपराध बन गया कि उनकी बेटी, जो शरारती तरीके से पली-बढ़ी थी, प्यार में पड़ गई और दूसरी जाति के व्यक्ति से शादी कर ली। वह विचार मन को बुरा लगा और परिरजनों को कसाई में बदल दिया। यह एक पल में नहीं हुआ। कई दिनों से चला आ रहा गुस्सा इस हद तक गिर गया है कि बिना दया के अपनी बेटी से शादी करने वाले युवक की बेरहमी से हत्या कर दी गई।

अमीरपेट एल्लरेड्डीगुडा के देवरकोंडा हरीश (28) डीजे का काम करता था। हरीश का परिवार करीब छह महीने पहले मेडचल मलकजगिरी जिले के कुतबुल्लापुर विधानसभा क्षेत्र के सुरारम कॉलोनी में शिफ्ट हो गया था। हरीश पहले से एल्लारेड्डीगुड़ा की एक लड़की से प्यार करता था। दोनों की अलग-अलग जातियां हैं। दोनों अपने बड़ों की जानकारी के बिना प्यार करने लगे थे। यह जानकर युवती के परिजनों ने हरीश को पद्धति बदलने की चेतावनी दी। हालांकि, हरीश ने 10 दिन पहले यह कहकर उससे शादी कर ली कि उनका प्यार पवित्र है। युवती ने भी अपने परिवार के प्रस्ताव को ठुकरा कर हरीश से शादी कर ली। शादी के बाद दोनों ने नया घर बसा लिया। खुशी से दोनों जीवन गुजरने लगे।

युवती के परिजन और रिश्तेदार जो पहले से नाराज थे, हरीश से और नाराज हो गए। यह सोचकर कि उनकी इज्जत मिट्टी में मिल गई है। बस और क्या था हरीश को मारने की योजना बनाई। करीब 10 दिन से हरीश की तलाश में जुटे गये। वे सुरारम कॉलानी भी गए जहां दोनों ठहरे हुए थे और पूछताछ की। एक दोस्त से हरीश के ठिकाने की जानकारी मिलने के बाद लड़की के परिजनों ने मारने रेकी की। 1 मार्च को हरीश अपनी पत्नी के साथ दूलापल्ली इलाके में गया, जहां उसकी बहन रह रही थी। युवती के परिजनों ने रेकी के अनुसार बुधवार की रात करीब नौ बजे हरीश का सड़क पर पीछा किया और उसकी बेरहमी से हत्या कर दी।

युवती की आंखों के सामने चाकू मारकर हरीश की हत्या कर दी गई। युवती उनके पैर पकड़कर दया की भीख मांगी, मगर किसी को दया नहीं आई। योजना के मुताबिक हत्या करने के बाद वे युवती को साथ लेकर चले गए। इसी बीच पेटबशीराबाद पुलिस को सूचना मिली कि हरीश खून से लथपथ पड़ा है। पुलिस ने हरीश के परिजनों को फोन किया और वे तुरंत थाने चले आये। वे यह जानकर फूट-फूट कर रोने लगे कि हरीश की हत्या क दी गई।

हरीश को पिता नहीं है। वह अपनी मां के साथ रहता था। हरीश के परिजनों और रिश्तेदारों की ओर से दर्ज कराई गई शिकायत के अनुसार पुलिस ने मामला दर्ज कर लिया है और सभी पहलुओं से जांच कर रही है। पुलिस ने हरीश की हत्या करने वाले आरोपितों की तलाश तेज कर दी है। हालांकि, खबर है कि युवती के भाई को हिरासत में लिया गया है और उससे पूछताछ की जा रही है। दूसरी ओर, हरीश के शव को पोस्टमॉर्टम के लिए सिकंदराबाद गांधी मोर्चरी में भेज दिया गया।

मृतक के जीजा शेखर ने पुलिस में दी गई शिकायत में कहा है कि लड़की के भाई ने फोन कर हरीश को जान से मारने की धमकी दी थी। और हरीश के बारे में पूछताछ की। उसने मांग की कि हरीश की हत्या करने वाले आरोपियों को कड़ी से कड़ी सजा दी जाए।

सम्मान के लिए अपने बच्चों को मारने वाले माता-पिता और दामाद को मौत के घाट उतारने वाले ससुराल वाले उसके बाद क्या प्राप्त करते हैं? वे जेल में सजा काटकर अपनी जिंदगी गंवा दे रहे हैं। जरूरत इस तरह के कानून बनाने की है कि दोषियों को कड़ी से कड़ी सजा मिले। इसके बाद कोई और ऐसा अपराध करने से डरे और सौ बार सोचे कि अपराध करने पर क्या हाल होता है। पुलिस को यह सुनिश्चित करने के लिए भी कदम उठाने चाहिए कि पीड़ितों को मामले की जांच में देरी किए बिना त्वरित न्याय मिले। दोषियों को सजा दिलाने के लिए अदालतों को जल्द से जल्द पर्याप्त सबूत उपलब्ध कराए जाये।

డీజే హరీష్ హత్యలో అసలేం జరిగింది 

హైదరాబాద్ : పరువు,  ప్రతిష్ట జీవిత గమనంలో అందరూ కోరుకునేది అదే. అందరూ పరువుతో బతకాల్సిందే.. దానికి ఎవరూ అతీతులు కారు. కానీ పరువు కోసం కొందరు పెద్దలు తమకున్న పరువును పొగొట్టుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తమ కూతుర్ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయి బంధువులు యువకుడిని చంపేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా వెలుగుచూసిన పరువు హత్యోదంతం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయి ప్రేమలో పడి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఆ తల్లిదండ్రుల దృష్టిలో క్షమించరాని నేరంగా మారింది. మనసును తొలిచిన ఆ ఆలోచన పెనుభూతంగామారి కన్నవారిని కాస్తా కసాయివారిగా మార్చేసింది. అదేదో క్షణికావేశంలో జరిగింది కాదు. రోజుల తరబడి పదును పెట్టిన ఆవేశం తమ అమ్మాయి వివాహమాడిన యువకుడిని దుర్మార్గంగా.. దయాదాక్షిణ్యాలు లేకుండా హతమార్చే స్థాయికి దిగజార్చింది.

అమీర్ పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన దేవరకొండ హరీష్ (28) డీజేగా పని చేస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం హరీష్ కుటుంబం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీకి షిఫ్ట్ అయ్యింది. అంతకుముందు నుంచే ఎల్లారెడ్డిగూడలోని ఓ అమ్మాయిని హరీష్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కులాలు వేర్వేరు. ఇద్దరూ తమ పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను హెచ్చరించారు. అయినా తమ ప్రేమ స్వచ్ఛమైందని 10 రోజుల క్రితం ఆమెను తీసుకెళ్లి.. పెళ్లి చేసుకున్నాడు హరీష్. యువతి కూడా తమవాళ్లను కాదని హరీష్ తో వెళ్లి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కొత్తకాపురం పెట్టారు. సంతోషంగా కాలం గడుస్తోంది. 

అప్పటికే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు.. హరీష్ పై మరింత పగ పెంచుకున్నారు. తమ పరువు పోయిందని భావించి.. ఎలాగైనా హరీష్ ను మట్టుబెట్టాలని ప్లాన్ చేశారు. దాదాపు10 రోజుల నుంచి హరీష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అతను ఉంటున్న సూరారంకాలనీకి వెళ్లి కూడా ఆరా తీశారు. హరీష్ ఫ్రెండ్ ద్వారా అతను ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం తెలుసుకున్న  యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించారు. మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి తన భార్యతో కలిసి వెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై వెంబడించి.. దారుణంగా హత్య చేశారు. 

యువతి కళ్లెదుటే కత్తులతో పొడిచి చంపారు. ఆమె కాళ్లవేళ్లా పడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించలేదు. ప్లాన్ ప్రకారం వచ్చిన పనిని కానిచ్చేసి.. అక్కడి నుంచి తమ వెంట యువతిని తీసుకుని వెళ్లిపోయారు.  ఇంతలోనే రక్తపు మడుగులో ఉన్న హరీష్ గురించి పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే హరీష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. చనిపోయింది తమ హరీషేనని తెలుసుకుని గుండెలవిసేలా రోదించారు.

ప్రేమిస్తే ఇంత ఘోరంగా చంపేస్తారా? అంటూ విలపించడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. హరీష్ కు తండ్రి లేడు. తల్లితో ఉంటున్నాడు. హరీష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ ను చంపిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. యువతి సోదరుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోస్టుమార్టం కోసం హరీష్ డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. 

తమ హరీష్ ను చంపేస్తామని అమ్మాయి సోదరుడు ఫోన్ చేసి బెదిరించారని మృతుడు బావ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరీష్ గురించి ఆరా తీశారని చెప్పాడు. హరీష్ ను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. 

పరువు ప్రతిష్టల కోసం కన్న బిడ్డలనే చిదిమేసే తల్లిదండ్రులు అల్లుళ్లను హతమార్చే అత్తమామలు ఆ తర్వాత ఏమి సాధిస్తున్నారు ? జైలుకెళ్లి శిక్ష అనుభవించి తమ జీవితాన్నే కోల్పోతున్నారు. దోషులకు కఠిన శిక్షలు పడి మరొకరు ఇలాంటి నేరం చేయాలంటే భయపడాల్సిన రీతిలో చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా కేసు దర్యాప్తు పేరిట కాలయాపన చేయకుండా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలి. దోషులకు శిక్ష పడే రీతిలో తగిన సాక్ష్యాధారాలను త్వరితగతిన కోర్టులకు అందజేయాలి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X