నూతన సంవత్సర 2023 శుభాకాంక్షలు : एमएलसी कविता और अन्य नेताओं ने दी नये साल की बधाई

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాలు సంతోషం, విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

नव वर्ष की सभी को हार्दिक शुभकामनायें | May your year be filled with love, laughter, sparkle, and hope. Wish you a Happy New Year.

-MLC K Kavitha

మీకు మీ కుటుంబ సభ్యులకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు..మీ ఆత్మీయులు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ సంస్థ సిబ్బందికి 2023 నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 2023లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో బాగా పనిచేసి ప్రజలకు మేలు చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. 2023 నూతన సంవత్సరంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆశీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ మరింత పురోగతి సాధిస్తుంది..

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుకు 24 గంటల కరెంటు ఇచ్చిన పథకానికి నేటి అర్ధరాత్రితో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరోసారి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు రాష్ట్ర ప్రజలకు మరోసారి పేరుపేరునా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

– గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్

రాష్ట్ర ప్రజల సుభిక్షమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం

అభివృద్ధి,సంక్షేమం కొత్త సంవత్సరంలో మరింత వేగవంతం

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

యావత్ తెలంగాణా సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి విజయవంతం అయ్యిందని ఆయన కొనియాడారు.మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం ప్రారంభించిన రోజున రూపొందించిన ఎజెండా 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలకు తగిన ప్రణాళికలు రూపొందించి సుభిక్షమైన పాలనను అందించి కొత్త వరవడిని సృష్టించి న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. అదే వరవడి తో నూతన సంవత్సరంలోనూ సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. అదే సమయంలో ప్రజలు నూతన సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు వారి వారి అభ్యున్నతికి దోహదపడలని ఆకాంక్షించారు.

మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రతీ ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అకాంక్షించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు

మంత్రి కామెంట్స్…

“జర్నలిస్టులు ఛాలెంజ్ గా పని చేస్తారు. పండుగలు, సెలవులు సైతం వదులుకొని పని చేస్తుంటారు. ఎంతో కష్టపడి సమాజం కోసం పని చేస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీరు వారధిగా పని చేస్తారు. జర్నలిజం ఒక గొప్ప వృత్తి, నిత్యం అప్డేట్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టుల పై ప్రత్యేక దృష్టి సారించారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడు లేనివిధంగా 20వేలకు పైగా అక్రిడేషన్లు మంజూరు చేశారు.

ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. జర్నలిస్టు ఇళ్ళ అంశం ముందుకు వెళ్తున్నది. త్వరగా పరిష్కారం అయ్యేలా నా వంతు కృషి చేస్తాను. బాలలత గారు 5 లక్షలలతో స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు. ఇప్పటి నుండి నేను కూడా 5 లక్షలు ప్రతి ఏటా జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు తోడ్పాటు అందిస్తాను. తెలంగాణ ప్రభుత్వం, బి కేటగిరీలో రిజ్వేషన్ తేవడం వల్ల 1071 మంది తెలంగాణ పిల్లలు నేడు ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందారు. ఇది గొప్ప విషయం ఇందులో జర్నలిస్టు పిల్లలకు కూడా సీట్లు రావడం గొప్ప విషయం. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. పీజీ స్థానాల్లో 2 వ స్ధానం, దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ 3 వ స్థానములో ఉంది. ఉద్యమ సమయంలో మీ సహకారం మేము మర్చిపోలేను.మీరు ఎంతో సహకరించారు. జర్నలిస్టుల కష్టాలు తీర్చడంలో మీ అందరికీ అందుబాటులో ఉంటాము. ఆర్థిక, అరోగ్య మంత్రిగా నా తోడ్పాటు అందిస్తాను.

మంత్రి హరీశ్ రావు

Happy New Year-2023:

నూతన సంవత్సరం-2023 ప్రారంభం సందర్భంగా యావత్ తెలంగాణ బిడ్డలకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రం గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్ని రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించాలని,ప్రజల ఆశలు నెరవేరాలని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో అభిలషించారు.అలాగే,ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అనుసరించి యువత తమ విలువైన కాలాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా మంచి ఉద్యోగాలు పొంది తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆకాంక్షించారు.

Ravichandra MP (RS)

నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్ : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని 2023 ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్పూర్తితో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ వడివడిగా ప్రగతి పథాన పయనింపజేసేందుకు కేసిఆర్ గారికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. 2022 లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మల్చుకుని, 2023 నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొని విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునందించే సంవత్సరం కావాలని కోరుకుంటూ…ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Happy New Year-2023

నూతన సంవత్సరం-2023 ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.2023 సంవత్సరం లో రాష్ట్ర ప్రజలు తాము ఎంచుకున్న వివిధ రంగాల్లో విజయం సాధించాలని,నూతన ఆలోచనలతో,పట్టుదలతో కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్ లోకి అడుగులు పెట్టాలని ఆయన కోరారు.తగు జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.

-గుత్తా సుఖేందర్ రెడ్డి

• రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

• కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు తేవాలి.. శుభాలు, సంతోషాలు అందించాలి

• సీఎం కేసిఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

• తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేసేందుకే బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు

• 2023 టిఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకం

• తెలంగాణలో 24 గంటల కరెంటుకు నేటి అర్ధరాత్రితో ఐదేళ్లు పూర్తి

• తెలంగాణ వ్యతిరేక బిజెపి కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలి

హైదరాబాద్: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నూత‌న సంవ‌త్స‌ర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

2022 సంవ‌త్స‌రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖలలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని, రాష్ట్ర, దేశస్థాయిలో వాటికి అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నామన్నారు.

ఈ కృషిలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. 2023లో మరింత ఉత్సాహంతో బాగా పనిచేసి ప్రజలకు మేలు చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది రేపు దేశం అనుసరిస్తుంది అన్న పద్ధతిలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

తెలంగాణ మోడల్ భారతదేశం మొత్తం అమలు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారని ఈ పార్టీకి 2023 అత్యంత కీలకమైంది అన్నారు. సీఎం కేసీఆర్ గారి ప్రయత్నంలో తెలంగాణ వాసులంతా భాగస్వాములు కావాలని కోరారు.

తెలంగాణలో రైతుకు 24 గంటల కరెంటు ఇచ్చిన పథకానికి నేటి అర్ధరాత్రితో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరెంటు కష్టాలు తీరాయని, రైతుబంధు ద్వారా పెట్టుబడి బాధ పోయిందని, తెలంగాణలో రైతు రాజు అయ్యాడని, వ్యవసాయం పండుగ అయిందని అన్నారు.

రేపు దేశంలో కూడా రైతును రాజు చేసి, వ్యవసాయాన్ని పండగ చేసి దేశాన్ని అన్నపూర్ణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న కృషి ఫలించాలని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ పట్ల అడుగడుగునా విపక్ష ప్రదర్శిస్తూ.. అభివృద్ధిని అడ్డుకుంటూ… కాళ్ళల్లో కట్టెబెడుతున్న బిజెపి కపత నాటకాలను గ్రహించాలని, మత పిచ్చితో, అధికార దుర్వినియోగంతో వారు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు మరోసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

-మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు

సూర్యాపేట జిల్లా వాసులు కొప్పుల ఈశ్వరన్న సైన్యం సూర్యాపేట జిల్లా నాయకులు మల్లయ్య, మల్లేష్, సందీప్ లు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాదపూర్వంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిపైన ఉన్న అభిమానంతో రచించిన “ప్రజా నాయకుడు కొప్పుల ఈశ్వరన్న” పాటల సీడిని మంత్రి రిలీజ్ చేశారు.

-సూర్యాపేట జిల్లా వాసులు

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు గిరిజన మరియు మహిళ శిశు సంక్షేమ శాఖలో ఈ ఏడాది సాధించిన ప్రగతిపై మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో వివరించారు.

డి ఎస్ ఎస్ భవన్ లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్

గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమానికి, మహిళ, శిశు సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది.

గౌరవ ముఖ్యమత్రి గారి పాలనలో రాష్ట్రం ఎర్పడిన అనతికాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా మరియు పరిపాలన వికేంద్రికరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం వేగంగా దూసుకు పోతుంది.

గౌరవ సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచడంతో, గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాది రంగాల్లో అవకాశాలు పెరిగాయి. త్వరలో అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందించబోతున్నాం. విద్య ద్వారానే వికాసం ఉంటుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వేయ్యికి పైగా గురుకులాలను ఎర్పాటు చేయడం జరిగింది. అందులో 183 గిరిజన గురుకులాలతో నూతనంగా మరో 3 గురుకులనా ప్రారంభించుకో బోతున్నాం.
రాష్ట వ్యాప్తంగా స్టడీ సెంటర్ లను ఎర్పాటు చేసి గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్ధాయి పోటీపరిక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి గాను పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట అందజేస్తున్నాము.

రాష్ట్ర వ్యాప్తంగా 3,146 గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ భవనాల నిర్మాణల కొసం ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో గౌ.ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించింది. ఆ దిశగా ఇప్పటికే 12 మేడికల్ కాలేజిలను ప్రారంభించుకున్నాము. ఏజెన్సీ ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

షెడ్యూల్ తెగల యువతీ, యువకులను పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దాడాని, వారిని ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో సబ్సిడి ఇస్తూ” సిఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఇన్నోవేషన్ స్కీమ్” అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల ప్రతి ఏడాది వందల మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి బీ.టీ రోడ్డు సౌకర్యం ఉండాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా మారుమూల తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 12 వేల 475 గిరిజన ఆవాసాలకు బి.టీ రోడ్ల సౌకర్యం కల్పించడానికి 1000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన సంక్షేమంతో పాటు మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసారు.
“ఆరోగ్య లక్ష్మి” పథకం కింద అంగన్ వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పాలు, గుడ్లతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి పటిష్టమైన సంక్షేమ చర్యలతో మహిళ, శిశు సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేయడంతో రాష్టంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గాయి. మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించడం ఎంతో సంతోషకరమైన విషయం. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించించడం రాష్ట్రం గర్వించదగ్గ విషయం.

మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రతి దశలోను తల్లి, బిడ్డల ఆరోగ్య పరిక్షరణకు అవసరమైన వైద్య సేవలు కల్పించడంతో పాటు, పోషక ఆహారలోపాన్ని నివారించేందుకు “కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం” ద్వారా అధనపు పౌష్టిక ఆహారం అందించడం, ప్రసవానంతరం పుట్టిన బిడ్డ సంరక్షణకు అవసరమైన సామాగ్రిని “కేసీఆర్ కిట్” ద్వారా అందించడం జరుగుతుంది. ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రo అంగన్వాడీ లబ్దిదారులైన చిన్నారులు, గర్భిణీ లు, బాలింతలకు ఇవ్వబడుతున్న పౌష్టికహర పద్ధతులను దేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని అభినందించారు.

అంతేకాకుండా మనం అంగన్వాడీ సెంటర్ లకు సరుకులను పంపిస్తున్న విధానం మరియు సాంకేతికను వినియోగిస్తున్న విధానం అత్యుత్తమంగా ఉన్నదని ప్రశంసించారు. కోవిడ్ కాలంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ మన అంగన్వాడీలు పౌష్టికాహారాన్ని అందించడాన్ని కూడా ప్రశoసించింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాలికల విద్యకోసం ప్రత్యేక గురుకులాలు ఎర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుంది. “కళ్యాణ లక్ష్మీ పథకం” ద్వారా లక్షా నూట పదహారు రూపాయ ఆర్ధిక సహాయన్ని ప్రభుత్వం ద్వారా అందించడం వలన బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగాము.
గ్రోత్ మానిటరింగ్ ద్వారా అంగన్వాడీ లలో ఉన్న చిన్న పిల్లల ఎదుగుదల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అత్యుత్తమoగా ఉందని కేంద్రం ప్రశంసించింది. బాలల సంక్షేమానికి, రక్షణకు తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యర్ధి ప్రశసించారు.

పిల్లల అఘాయిత్యాల కేసుల పరిష్కర ప్రక్రియ వేగంగా జరిగేందుకు వరంగల్ జిల్లాలో ఎర్పాటు చేసిన ఫోక్సో కోర్టును మాడల్ గా తీసుకుని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని వారు సూచించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 26 వతేదిన ఇక్కడకు వచ్చి ఐదు రోజులపాటు పర్యటించారు. రాష్ట్ర పతి పర్యటన బాద్యతలను గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నాకు అప్పగించడం నా అదృష్టంగా బావిస్తున్నాను వారికి నా ప్రత్యేక కృతజ్జతలు తెలియజేస్తున్నాను.. సీఎం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను సమన్వయకర్తగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటే ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటనను విజయవంతం చేసాను.

రాష్ట్రపతి గారు శీతాకాలం విడిదిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గోన్నారు. రామప్ప, భద్రాచలం, యాదాద్రి పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆలయాల విషిష్టత, వైభవాల పట్ల సంతోషం వ్యక్తం చేసారు. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముగారు రాష్ట్రంలోని గిరిజన అమలవుతున్న సంక్షేమం పై సమీక్ష నిర్వహించారు. ఆదిమ జాతి గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమం పై పవర్ ప్లాంట్ ప్రదర్శన ద్వారా వివరంగా వివరించాము. ఆదివాసీల కోసం గౌరవ ముఖ్యమంత్రిగారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్ల రాష్ట్ర పతి హార్షం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించడంతో పాటు ఇతర రాష్ట్రల్లో ఇదేవిధంగా అమలు జరగాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమం, మరియు గిరినుల తరుపున వచ్చే అభ్యర్ధనల పట్ల పెద్ద మనసుతో తెలంగాణ రాష్టానికి సహకరించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము గారిని కోరడం జరిగింది.

మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గిరిజన అభివృద్ధితో పాటు, మహిళ ,శిశు సంక్షేమంలో అద్భుత విజయాలను సాదించడం జరిగింది. కేంద్ర సంస్థలు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఇంతటితోనే కాకుండా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గారి పాలనలో వారి అదేశాలు,సూచనలతో మరింత భాద్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తాము. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, సి.ఈ శంకర్, జేడీ. కళ్యాణ్ రెడ్డి, జీ సి సి జీఎం సీతారాంనాయక్ , ట్రైకార్ జీఎం శంకర్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X