“Praja Sagrama Yatra-5” Update: 9వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ఈ రోజు 12 కిలోమీటర్ల

BREAKING

Hyderabad:

https://www.youtube.com/watch?v=I5EztBS6L7M

9వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇక్బాల్ పూర్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. ఇక్బాల్ పూర్ గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు హారతులు పట్టి, స్వాగతం పలికిన ఆడపడుచులు.

నిర్మల్ జిల్లా: లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. కాసేపట్లో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇక్బాల్ పూర్ గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర.

ఈ రోజు సాయంత్రం ఖానాపూర్ నియోజకవర్గంలోని పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

ఈసారి ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

ప్రజా సమస్యలపై ఉధ్రుతంగా ఉద్యమించండి

టీఆర్ఎస్ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి

వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. నా పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్న టీఆర్ఎస్ అరాచకాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదు. ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

• ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరాచకాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై తీవ్రస్థాయిలో ఉద్యమించాలని పేర్కొన్నారు.

• ఈరోజు మధ్యాహ్నం ఖానాపూర్ నియోజకవర్గంలో ఇక్బాల్ పూర్ సమీపంలోని పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, మహిళా మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

• ఈ సందర్భంగా మోర్చాల పనితీరు, జిల్లాల వారీగా కమిటీల నియామకం, సంస్థాగత బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు రాబోయే రోజుల్ల్ ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

• ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మోర్చాలన్నీ క్రియాశీలకంగా ఉండాలని, తీవ్రస్థాయిలో ఉద్యమించాలని సూచించారు. అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస

  • నమూనాలిస్తే అంతా నిరూపిస్తా
  • రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా?
  • నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా….
  • నేను ఏ పరీక్షకైనా సిద్ధం
  • హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయించాల్సిందే
  • జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటు
  • దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా … కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలి
  • ఆ సమయంలో బిడ్డను సారా దందా స్కాం నుండి ఎట్లా కాపాడుకోవాలనే దానిపై లాయర్లతో మంతనాలు
  • అంబేద్కర్ జయంతి, వర్దంతిలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్
  • అంబేద్కర్ స్పూర్తితో శక్తివంతమైన దేశంగా మార్చుతున్న గొప్ప నాయకుడు మోదీ
  • ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్
  • ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళి

కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?’’అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బీసీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా

అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదు

కెసిఆర్ ఇంటి నుంచి బయటికే రాడు

అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది

వారం రోజులపాటు బస్తీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తాం

అంబేద్కర్ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది

నేను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే… అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే

అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని మోడీ పాలిస్తున్నారు

మోడీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోంది

రామ్నాథ్ కోవింద్ ను భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత మోడీదే

పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపినే

అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే… ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం

12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత కూడా మోడీదే

ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రు లుగా చేసిన ఘనత బిజెపి దే

ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామికవేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపి దే

అంబేద్కర్ వర్ధంతికి కెసిఆర్ బయటకి రాడు

జి20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణం

జి 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే… కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు?

జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముంది?

కేసీఆర్ దళితుడిని సీఎం చేశాడా?

దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది?

కెసిఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు

అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు?

కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారు

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు… కేసీఆర్ అంతా పోటుగాడా?

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు

ప్రశ్నించక పోవడంతోనే ముఖ్యమంత్రికి బలుపెక్కి, బరితెగించి ఈరోజు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు

నేటికీ తెలంగాణ దళిత బస్తీల్లో కనీస సౌకర్యాలు లేవు

1400 మంది పేదోళ్ల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది

కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, పేదోళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

దొంగ సారా దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే… కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు

దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు… దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయి

రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చండి

పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయలు అప్పు పెట్టిండు

కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ పోయి లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది

కేసీఆర్ కుటుంబం విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది

కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే… తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా?

లిక్కర్ దందా చేస్తే.. దర్యాప్తు సంస్థలు గుంజుకు పోవా?

లిక్కర్ దందాలో కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసింది

అక్రమంగా సంపాదించిన సొమ్ముతో… ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుంది

అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందింది

తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు

లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన కవితను అరెస్టు చేస్తే… రాష్ట్రంలో ప్రజలు ధర్నా చేయాలా?

డ్రగ్స్ దందా వారిదే

ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు

డాక్టర్ దగ్గరికి వెళ్లి కేటీఆర్ వి రెండు వెంట్రుకలు ఇస్తే చాలు. డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుస్తుంది

ఒకవేళ నేను తంబాకు తిన్నట్లయితే.. నా లివరు, కిడ్నీ ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు

బెంగళూరు డ్రగ్స్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తాం

లంగదందాలు… దొంగ దందాలు చేస్తే .. చూస్తూ ఊరుకుంటామా?

అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు

ఎన్నికలప్పుడు ప్రజలంతా జాగృతం కావాలి… చైతన్యవంతులు కావాలి

మునుగోడులో దొంగ ఓట్లు రాయించుకుని టిఆర్ఎస్ గెలిచింది. అది గెలుపే కాదు

మునుగోడులో నైతిక గెలుపు, నిజమైన గెలుపు బిజెపి దే

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చినందుకే.. ఈ రాష్ట్ర0 ఏర్పడింది

తెలంగాణ ద్రోహి కేసీఆర్

పేదల రాజ్యం వస్తేనే… ప్రజా సమస్యలు తీరుతాయి

ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి.

BREAKING

9వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. మామడ మండలం శివార్లలో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. దిమ్మదుర్తి, రాజురా గేట్, ఇక్బాల్ పూర్ మీదుగా ఖానాపూర్ వరకు సాగనున్న పాదయాత్ర. నేడు మొత్తం 12 కిలోమీటర్ల మేర కొనసాగునున్న “ప్రజా సంగ్రామ యాత్ర”. ఈరోజు ఖానాపూర్ లో బండి సంజయ్ రాత్రి బస.

BREAKING

9వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. పాదయాత్రలో నడుస్తున్న బండి సంజయ్ ని, తన వద్దకు వచ్చి, తమ సమస్యలను చెప్పుకుంటున్న నిరుద్యోగులు, రైతన్నలు, వివిధ వర్గాల ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తనకు చెప్పుకుంటున్న సమస్యలను, స్వయంగా నోట్ చేసుకుంటున్న బండి సంజయ్. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా… ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ… వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్. కాసేపట్లో దిమ్మదుర్తి గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర.

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. దిమ్మదుర్తి గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు. బాణసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికిన యువత. పూలవర్షం కురిపించి, స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు. హారతులు పట్టి, స్వాగతం పలికిన ఆడపడుచులు. కాసేపట్లో దిమ్మర్దుర్తి గ్రామంలోని డా. బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా… ఆయన విగ్రహానికి పూలమాలవేసి, నివాళి అర్పించనున్న బండి సంజయ్.

BREAKING

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాని”కి పూలమాల వేసి, నివాళి అర్పించిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, ఇతర ముఖ్య నేతలు.

BREAKING

“బిజెపి కార్నర్ మీటింగ్ @ దిమ్మదుర్తి గ్రామం”

కొప్పు భాష, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు:

కేసీఆర్ పాలనలో దళితుల పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి హామీ అటకెక్కింది. హుజురాబాద్ ఎలక్షన్ల కోసం ‘దళిత బందు’ తీసుకొచ్చిన మహా మోసగాడు కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే దళిత బందును ఇస్తారా? గ్రామాల్లో ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్ అంటుంటే… బీజేపీ తప్ప, ఎవరు చప్పుడు చేయడం లేదు. 12 మంది ఎస్సి ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఎస్సీ ముద్దుబిడ్డ రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బిజెపి దే. ఇంతమంది ఎస్సి లను గౌరవప్రదమైన స్థానంలో ఉంచిన బిజెపి దళిత వ్యతిరేకా?

సోయం బాపూరావు, అదిలాబాద్ ఎంపీ కామెంట్:

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే… ఆరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. చట్టసభల్లో 12% ఎస్సీల కోసం బడ్జెట్ ను కేటాయించాలని కూడా రాజ్యాంగంలో అంబేద్కర్ రాశారు. నిర్మల్ లో బిజెపి బహిరంగ సభను చూసి అక్కడి మంత్రి అల్లకల్లోలం అయ్యిండు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలకు సంబంధించి, పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.

9వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”

మామడ మండలం శివార్లలో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర .దిమ్మదుర్తి, రాజురా గేట్, ఇక్బాల్ పూర్ మీదుగా ఖానాపూర్ వరకు సాగనున్న పాదయాత్ర. నేడు మొత్తం 12 కిలోమీటర్ల మేర కొనసాగునున్న “ప్రజా సంగ్రామ యాత్ర”. ఈరోజు ఖానాపూర్ లో బండి సంజయ్ రాత్రి బస.

9వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”

పాదయాత్రలో నడుస్తున్న బండి సంజయ్ ని, తన వద్దకు వచ్చి, తమ సమస్యలను చెప్పుకుంటున్న నిరుద్యోగులు, రైతన్నలు, వివిధ వర్గాల ప్రజలు

రైతులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తనకు చెప్పుకుంటున్న సమస్యలను, స్వయంగా నోట్ చేసుకుంటున్న బండి సంజయ్

ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బండి సంజయ్

పాదయాత్రలో భాగంగా… ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ… వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్

కాసేపట్లో దిమ్మదుర్తి గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర.

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

దిమ్మదుర్తి గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

బాణసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికిన యువత

పూలవర్షం కురిపించి, స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు

హారతులు పట్టి, స్వాగతం పలికిన ఆడపడుచులు

కాసేపట్లో దిమ్మర్దుర్తి గ్రామంలోని డా. బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా… ఆయన విగ్రహానికి పూలమాలవేసి, నివాళి అర్పించనున్న బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X