హైదరాబాద్ : డా బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య కె సీతారామ రావు సతీమణీ శ్రీమతి కుసుంబ రేవతి గారు ఇటీవల మరణించడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం యూనివర్శిటీ లోని వీసీ బంగ్లా లో పరామర్శించారు. స్వర్గీయ రేవతి చిత్రపటం వద్ద పూలు వేసి, నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఆచార్య సీతారామ రావు, ఆయన కుమారులు సృజన్, చరణ్, సోదరుడు వెంకటేశ్వర రావు ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి తదితరులు ఉన్నారు.
వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె సీతారామ రావు గారి సతీమణి శ్రీమతి రేవతి గారు మంగళవారం (15-11-2022) తెల్లవారు జామున 4.15 నిమిషాలకు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ (హైదరాబాద్) లో తుది శ్వాస విడిచారు.
Related News: