ప్రత్యేక లాబరేటరీల నిర్మాణానికి స్థలం అవసరం
75వ రోజుకు చేరిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్ : అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ కోర్సు దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన కోర్సు అని జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డా. రాజ గౌడ్ పేర్కొన్నారు. 2024-25 విద్య సంవత్సరంలో ఎం.ఎల్.ఐ.ఎస్సి,. బి.ఎల్.ఐఎస్సి. కోర్సుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ల తీసుకురన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులే ఎక్కువ శాతం ఉద్యోగాలు సాదించారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో లైబ్రరీ సైన్స్ విద్యార్థులకు మౌలిక వసుతులు (ప్రాక్టికల్ క్లాస్సలు) తీసుకోవాలంటే లాబరేటరీ కేంద్రాలను విస్తరించాలని పేర్కొన్నారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను మంగళవారం కూడా కొనసాగించారు. గత 75 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read-
కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. ఎల్వికే రెడ్డి, డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. యాకేశ్ దైద; ప్రొ. జి. మేరీ సునంద; బ్రహ్మానంద నాయుడు, రుశేంద్ర మణి, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. రజిత, షబ్బీర్; అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.