We Want Justice: వైఎస్ షర్మిల రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష, క్షీణిస్తోంది ఆరోగ్యం, కిడ్నీలకు ప్రమాదం : డాక్టర్లు

Hyderabad: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష లోటస్ పాండ్‌లో రెండో రోజు కొనసాగుతోంది. షర్మిలకు మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ అవుతోందని, ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. షర్మిలకు బ్లడ్ టెస్ట్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వైస్సార్‌టీపీ కార్యకర్తలను లోపలకు పోనీయకుండా అడ్డుకుంటున్నారు. పలుచోట్ల వైఎస్సార్‌టీపీ శ్రేణులను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్లాగా… టీఆర్ఎస్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు తమపై ఎందుకంత కక్షగట్టారని ప్రశ్నించారు. కారణం లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అరెస్ట్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన అనంతరం అక్కడే షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు పోలీసులు తరలించారు. దీంతో లోటస్‌ పాండ్‌లోనే షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తాలిబన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలను ఎత్తిచూపినందుకే తమను నిర్భంధాలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన ఒక్క ఒక్కహామీని నెరవేర్చలేదని.. కరప్షన్ కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బిడ్డ లిక్కర్, కొడుకు ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాత్రి కూడా దీక్ష వేదికపైనే వైఎస్ షర్మిల ఉన్నారు. షర్మిల దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. షర్మిల దీక్ష నేపథ్యంలో 40 మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులను అరరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఏడుగురు నేతలను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను విడుదల చేసేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని షర్మిల అన్నారు. మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని 4లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టే దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరాడని విమర్శించారు.

కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడానికి కారణాలు లేవని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రభుత్వం దిగొచ్చే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా హైకోర్టు తీర్పును అగౌరవపరుస్తుందని షర్మిల అన్నారు. (Agncies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X