డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, తప్పక చదవండి వీసీ సందేశం…

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఇ.ఎం.ఆర్ & ఆర్.సి (EMR&RC) భవనం ముందు ప్రొ. జి. రాంరెడ్డి స్మారక ప్రాంగణంలో జమ్మి చెట్టు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత అని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పర్యావరణ ఆవశ్యకతను విధ్యార్థులకు తప్పనిసరిగా భోధించాలని సూచించారు.

Also Read-

అనంతరం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. కె. వియ్యన్న రావు ఆన్ లైన్లో పాల్గొని మన “ప్రకృతి – మన జీవితం” అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి; ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. కిరణ్మయి, ప్రొ. పి. వెంకటరమణ, ప్రొ. జి. దయాకర్, ప్రొ. కె. కృష్ణా రెడ్డి, పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, వివిధ శాఖల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X