BRAOU : మానవ సమాజాభివృద్ధిలో మాతృభాష ముఖ్యం : ప్రొ. అజీజ్ బానో

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కళల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భాష మరియు సాహిత్య ఫోరమ్ లో భాగంగా “మాతృభాష ఉర్దూ ప్రాముఖ్యత” అనే అంశంపై వెబ్‌నార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ కళాశాల డీన్ ప్రొ. అజీజ్ బానో ముఖ్య అతిథిగా పాల్గొని ‘మాతృభాష ఉర్దూ ప్రాముఖ్యత’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.

అజీజ్ బానో మాట్లాడుతూ మానవ సమాజ అభివృద్ధి లో మాతృభాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. భారత ఉపఖండంలో సంక్లిష్ట సాహిత్య చరిత్రలో ఉర్దూ యొక్క గొప్ప సంప్రదాయ బాష అని, అందులో ఉర్దూ అంతర్భాగమని ప్రొఫెసర్ చెప్పారు. ఉర్దూ సాహిత్య ప్రపంచానికి మరియు భారతీయ సమకాలీన సేవల ద్వారా తరచుగా అందించబడిన ఉర్దూ మరువలేనివి కాబట్టి, మొఘల్ కాలంలో విపరీతంగా మద్దతు, ప్రచారం పొందిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు మాట్లాడుతూ దేశంలో భిన్న సంస్కృతులున్నాయని, భాషలు వేరైనా అన్ని భాషల రచయితలు రానున్న రోజుల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఉర్దూ లిటరేచర్ ఫోరం సాహిత్య రచన చేసిన విద్యార్థులను పరిచయం చేస్తుందన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉర్దూ విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ. వి. ఎన్. రెడ్డి మాట్లాడారు. భాష మరియు సాహిత్య వేదిక రూపకర్త, కళల విభాగాల డీన్ ప్రొ. షకీలా ఖాణం మాట్లాడుతూ వేదిక ఏర్పాటు అవసరం, ఆవశ్యకతను వివరించారు. అతిథి పరిచయం చేశారు. వెబ్‌నార్ కోఆర్డినేటర్, డా. సుమయ్య తమ్‌కీన్ కార్యక్రమం నిర్వహణ ఆవశ్యకతను మరియు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో డా. మహ్మద్ ఖాజా మక్దూమ్ మొహియుద్దీన్ పలు విభాగాల డీన్స్, తెలుగు విభాగ అధిపతి డా. ఎన్. రజని, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఉద్యోగులు, ఉర్దూ, తెలుగు, హిందీ భాష పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

MOTHER TONGUE PLAYS AN IMPORTANT ROLE IN REACHING HUMAN SOCIETY : Prof. Aziz Bano

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU), Department of Arts organized Language and Literature Forum webinar on ‘Mother Tongue and Importance of Urdu’ at the University Campus on Friday.

Prof.Aziz Bano, Dean, School of Languages, Lingusitic & Indology MANUU was the Chief Guest Prof. Bano said that the mother tongue plays an important role in reaching human society, rich tradition of Urdu is an integral part of the complex literary history of the Indian subcontinent. It has been claimed that the tradition is still relevant today, as the Urdu literary world and often contributed by contemporary services to the Indian and world are unforgettable, and received tremendous support during the Mughal period.

Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the program. Prof. Rao said there are different cultures in the country and even though the languages are different, writers of all languages need to work to create awareness among the people in the coming days, the Urdu Literature Forum will introduce students those have written literary works. Dr. B. R. Ambedkar Open University expressed hope that would be more useful to the urdu students and research students.

Prof. Shakeela Khanam, Webinar Director, Dean Faculty of Arts initiated the Language and Literary forum, explain the aims, objectives of the program and introduced the chief guest. Webinar Coordinator, Dr. Sumayya Tamkeen Proposed vote of Thanks. Dr. Mohd. Khaja Maqdoom Mohiuddin and all the Directors, Heads of the Branches, Deans, Teaching and Non-Teaching staff members and Urdu Research Scholars & Students also participated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X