హైదరాబాద్ : డా. బీ. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదవిలో పని చేసి పదవి విరమణ పొందిన ప్రముఖ సమాజ సేవకులు వేమూరి మార్కండేయ శర్మ మరియు శ్రీమతి ఉమశ్రీ కుమారుడు శ్రీనివాస వంశీ భార్గవ శర్మ వివాహము అమంచర్ల సుందర శర్మ మరియు శ్రీమతి మీనాక్షి పుత్రిక అన్యన తో మే 3 తెదిన నోమ కళ్యాణ వేదిక (నాచారం) లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకలో వేమూరి మార్కండేయ శర్మ మరియు అమంచర్ల సుందర శర్మ వారి బంధువులు, మిత్రులు, సహోద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధు-వరులను ఆశీర్వదించారు. అలాగే తాంబూలాలు స్వీకరించారు.

ముఖ్యంగా వేమూరి మార్కండేయ శర్మ డా. బీ. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేసిన సేవలను ఇప్పుడు కూడ సహోద్యోగులు, విద్యార్ధులు తలుచుకుంటారు. అంతే కాకుండ సమాజ సేవలో కూడ అందరికన్నా ముందు ఉండే గొప్ప మనిషి మార్కండేయ శర్మ అని చాల మంది చెప్పుకుంటారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ సమాచార్’ వధు-వరులకు శుభాకాంక్షలు తెలుపుతుంది.

ఇది కూడ చదవండి-

