हैदराबाद : प्रयागराज में श्रद्धालु संगम में डुबकी लगा रहे हैं। आस्था का महापर्व महाकुंभ सोमवार को पौष पूर्णिमा स्नान के साथ ही आरंभ हो चुका है। लाखों की संख्या में श्रद्धालु देश और विदेश से प्रयागराज पहुंच चुके हैं। तड़के 4 बजे से ही श्रद्धालु संगम में डुबकी लगा रहे हैं। अबतक एक करोड़ लोग संगम में डुबकी लगा चुके हैं। अंदाजा है कि अगले दो दिन में यह संख्या 4 करोड़ तक पहुंचने की संभावना है। महाकुंभ में लोगों की भीड़ को देखते हुए सुरक्षा व्यवस्था कड़ी कर दी हैं।
महाकुंभ के प्रथम स्नान पर्व पर शहर की सड़कों पर अलग तरह की चहल-पहल है। संगम जाने वाली हर सड़क पर लोग झुंड में जा रहे है। पौष पूर्णिमा के पहले स्नान पर्व से पूर्व रविवार को लगभग 50 लाख श्रद्धालुओं ने संगम त्रिवेणी में आस्था की डुबकी लगाई थी। बड़ी संख्या में साधु-संतों के साथ ही पुरुषों, महिलाओं, बुजुर्गों और बच्चों ने संगम में डुबकी लगाई। इससे पहले शनिवार को भी 33 लाख श्रद्धालुओं ने संगम में स्नान किया था।

महाकुंभ के पहले दो दिन में चार करोड़ श्रद्धालुओं के डुबकी लगाने का अनुमान है। 41 घाट और डेढ़ लाख टेंट की व्यवस्था की गई है। स्नान पर्व से पूर्व सभी प्रमुख साधु संत अखाड़ा क्षेत्र में प्रवेश कर चुके हैं। महाकुम्भ में सभी अखाड़ों का छावनी प्रवेश पूरा हो चुका है। 14 जनवरी को मकर संक्रांति पर पहले अमृत स्नान पर सभी अखाड़े अपने क्रम के अनुसार स्नान करेंगे।
यह भी पढ़ें-

शहर में भीड़ बढ़ने पर सीएमपी कॉलेज चौराहा, नागवासुकि मंदिर, छोटा बघाड़ा, अरैल, झूंसी में चीनी मिल के पास गाड़ियों को रोका जाने लगा। देर रात और तड़के आए श्रद्धालु सीधे संगम पहुंचे और स्नान पर्व के एक दिन पहले संगम स्नान किया। महाकुंभ में 45 करोड़ से अधिक श्रद्धालुओं की सुरक्षा सुनिश्चित करने के लिए प्रयागराज पुलिस ने व्यापक सुरक्षा इंतजाम किए हैं। महाकुंभ का आयोजन 144 साल में एक बार होता है। (एजेंसियां)
మహాకుంభమేళా–2025
అత్యంత వైభవంగా జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్ రాజ్ లో పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళా కోసం భారీగా భద్రత ఏర్పాటు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా నిళ్లలో తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు.
అంతేకాకుండా చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. తొలిసారిగా నిఘా కోసం 100 మీటర్ల వరకు డైవింగ్ చేయగల అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 120 మీటర్ల ఎత్తుకు చేరుకోగల టెథర్డ్ డ్రోన్‌లను కూడా మోహరించినట్లు వెల్లడించింది. రియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలతో కనీసం 2,700 కెమెరాలు ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీనితో పాటు, 56 మంది సైబర్ వారియర్ల బృందాన్ని నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.
యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 150,000 టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను యూపీ అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అనేక ఎలక్ట్రిక్ బస్సులు, అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో 98 ప్రత్యేక రైళ్లనుభారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. దీనితో పాటు, నగరంలో 92 రోడ్ల పునరుద్ధరణ, 30 వంతెనల నిర్మాణాలను చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. కాగా.. 45 రోజులపాటు జరిగే కుంభమేళా కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యటకులు రానున్నారు. మొత్తం 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం (UP Govt) అంచనా వేస్తోంది. సోమవారం ఒక్కరోజే 40 లక్షలకు పైగా యాత్రికులు పవిత్ర కర్మ ‘షాహి స్నానం’ చేస్తారని అధికారులు అంచనావేశారు. అంతేకాకుండా,
కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది.’’ అని మోడీ రాసుకొచ్చారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. “సంస్కృతుల సంగమం ఉన్న చోటే విశ్వాసం, సామరస్యం సంగమం ఉంటుంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సందేశాన్ని ఇస్తూ కుంభమేళా. సనాతన ధర్మంతో పాటు మానవాళి సంక్షేమాన్ని కోరుకుంటుందని ” అని యోగి ఎక్స్ లో రాసుకొచ్చారు. (ఏజెన్సీలు)