ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, …తో కలిసి కొద్దిసేపు…

జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ లారా… ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

హిందూ సమాజమంతా ఏకమై మిమ్ముల్ని ఓడించడం తథ్యం

ఎవరికి ఓటేయాలో మీ డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగి నిర్ణయం తీసుకోండి

రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త

హిందూ సమాజ సంఘటితం కోసం పోరాడే నాయకుడు

మేమంతా ఒకటే… మా మధ్య విబేధాల్లేవ్

పేదలకు ఇచ్చేది ముమ్మాటికీ మోదీ బియ్యమే

రేషన్ కు కేంద్రం పైసలు అక్కర్లేదని లేఖ రాసే దమ్ముందా?

కేటీఆర్…హెచ్ సీయూ భూముల బ్రోకర్ ఎవరో, అవినీతిసహా ఆధారాలు బయటపెట్టే దమ్ములేదా?

హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు వెళ్లింది ఏబీవీపీ, బీజేపీ నాయకులే

ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి?

6 గ్యారంటీలపై అసెంబ్లీలో కొట్లాడలేని అసమర్ధ పార్టీ బీఆర్ఎస్

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయిట్ మెంట్ ఇవ్వడం లేదు

రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు

బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి

రాజాసింగ్ తో కలిసి కొద్దిసేపు ముచ్చటించిన బండి సంజయ్

హైదరాబాద్ : ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా… మీరు మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటున్నారు కదా? మీకు ఓట్లేసి గెలిపించేది హిందువులే తప్ప అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎంఐఎం అభ్యర్ధికి ఓటేస్తే… హిందు సమాజమంతా ఒక్కటై మిమ్ముల్ని ఓడించడం తథ్యం’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని పేర్కొన్నారు. హిందూ ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి సందర్భంగటా హిందూ సమాజమంతా ఏ విధంగా ఏకమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకుని ఓటేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఓటేసే ముందు కార్పొరేటర్లంతా తమ తమ డివిజన్ ప్రజలతోపాటు కుటుంబ సభ్యుల మనోభావాలను తెలుసుకుని ఓటేయాలని కోరారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజాసింగ్ తో కలిసి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రాజాసింగ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే….

ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ పవర్ పుల్ ఆలయం. గతంలో ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు వచ్చిన. ఇక్కడికి వస్తే నా వెంట్రుకలు నిక్కబొడుస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. హిందూ సమాజ సంఘటిత శక్తిని ప్రదర్శించేలా చరిత్ర స్రుష్టించే రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గొప్ప ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తారు. సంఘ విద్రోహ శక్తుల నుండి కాపాడే దైవం హనుమంతుడు. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

Also Read-

బీజేపీ ఎంపీ అనే ఓ బ్రోకర్ ద్వారా హెచ్ సీయూ భూముల అమ్మేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…

కేటీఆర్ కు నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయటపెట్టొచ్చు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే.

బండి సంజయ్ రక్షకుడన్న మాటలను మీడియా ప్రస్తావించగా…

కేటీఆర్ కు కళ్లు దొబ్నినయ్. రేవంత్ రెడ్డి సర్కార్ పై పోరాడుతున్నది బీజేపీయే కదా? 6 గ్యారంటీలపై అడుగడుగునా నిలదీస్తోంది మేమే కదా? హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయింది మేమే కదా? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా? .. వాకౌట్ చేసిందా?… ప్రతిరోజు 6 గ్యారంటీల హామీల ఎగవేతపై కాంగ్రెస్ ను నిలదీస్తోంది నేనే. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500లు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, 2 లక్షల ఉద్యోగాలపై నిరంతరం మాట్లాడింది, పోరాడింది బీజేపీయే.. కానీ మీరేనాడైనా పోరాడారా? అంతెందుకు హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయింది ఏబీవీపీ కార్యకర్తలే. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పోరాడారా?

అయినా నేను అడుగుతున్నా… మీడియా వాళ్లను పట్టుకుని కేటీఆర్ ‘‘వాడెవడో పేపరోడు, వీడెవడో టీవోడు’ ఆ బీజేపోడు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతుంటే జర్నలిస్టులు స్పందించరా? కేటీఆర్ ను ప్రజలు ఓడగొట్టినా ఇంకా అహంకారం తగ్గలేదు. కేసీఆరే ఇంకా అధికారంలో ఉన్నడని అనుకుంటున్నడేమో.. ఆయన అహంకారం దించుతం.

రేవంత్ రెడ్డి మోదీపై చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా…

రేవంత్ రెడ్డిగారికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆయన మెప్పు పొందేందుకు మోదీపై ఇష్టానుసారం మాట్లాడుతున్నడు. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే మోదీపై అడ్డగోలుగా మాట్లాడితే ఏమైంది?… అభివ్రుద్ధికి సహకరిస్తానని కేంద్రం చెప్పినా వినకుండా అన్యాయం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో నడుస్తోంది. ఆ పార్టీకి కూడా ఆదే గతి పడుతుంది

హెచ్ సీయూ భూములపై అడిగిన ప్రశ్నకు…

ఈ అంశం కోర్టులో ఉంది. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనీయబోం. కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉంది.

రేషన్ బియ్యం కాంగ్రెస్ ఘనతేనని, సన్నబియ్యం ఇస్తోంది రేవంత్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ చెబుతోంది కదా? అని అడిగిన ప్రశ్నకు…

రేషన్ ద్వారా అమ్మే బియ్యంలో ఒక్క కిలోకు రూ.37లు ఇస్తోంది కేంద్రమే కదా? ఆ మాట సంబంధిత మంత్రి కూడా ఒప్పుకున్నారు కదా? మరి కాంగ్రెస్ బియ్యం ఎట్లా అయితయ్. కాంగ్రెస్ ఎన్ని చెప్పినా… రేషన్ షాపులో ఇచ్చేది మోదీ బియ్యమే తప్ప రేవంత్ రెడ్డి బియ్యం, ఉత్తమ్ బియ్యం, కాంగ్రెస్ బియ్యం అని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు బియ్యం కోసం కేంద్రం ఖర్చు చేస్తోంది. ఒకవేళ రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర నిధులు అక్కర్లేదని అనుకుంటే దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలి. ‘‘మీ బియ్యం మాకు అవసరం లేదు. అందుకోసం కేంద్రం పైసలియ్యాల్సిన అవసరం లేదు. ఆ బియ్యానికి అయ్యే పైసలన్నీ మేమే భరిస్తాం. ఖర్చు పెడతాం’’ అని కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? సమాధానం చెప్పాలి.

బీజేపీతో రాజాసింగ్ కు విబేధాలున్నాయంటూ వస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు….

రాజాసింగ్ బీజేపీ సీనియర్ నేత. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నాయకుడు. 2018లో మా ఏకైక ఎమ్మెల్యే. సమాజ ధర్మం, బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త రాజాసింగ్. హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయకుడు. ఆయనతో ఎలాంటి విబేధాల్లేవు. బీజేపీలో అందరం కలిసే ఉంటున్నాం.

బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయబోమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్సందిస్తూ…

ఇప్పటికే మేం తెలంగాణలో 50 శాతానికిపైగా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 3 ఎమ్మెల్సీలు మావే. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తోంది కూడా బీజేపీయే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడమే నిదర్శం కదా? ఇంకా ఆయన అడుగుపెట్టనిచ్చేదేముంది?

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న బలమేంది? గెలుస్తుందనే నమ్మకం ఉందా? అని అడిగిన ప్రశ్నకు….
మా బలమేందో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తేలిపోయింది. మాకు బలం ఉంది కాబట్టే మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బలం లేదు కాబట్టే పోటీ చేయడానికి కూడా అభ్యర్థులే దొరకడం లేదు. ఎవరికి బలముందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఒకటే కోరుతున్నా….మీ గుండెపై చేయి వేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎంఐఎం పార్టీకి ఓటేయమని అడగండి. మీరంతా మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటున్నారు కదా? మరి మీకు హిందువుల ఓట్లు వద్దా? అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు మిమ్ముల్ని గెలిపిస్తారనుకుంటున్నారా? లేక రేవంత్ రెడ్డి, కేటీఆర్ గెలిపిస్తారనుకుంటున్నారా? మిమ్ముల్ని గెలిపించేది హిందువులే కదా?

ఒకవేళ పొరపాటున ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తే హిందు సమాజం క్షమించదు. హిందూ ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి, వినాయక చవితి సందర్భంగా హిందూ సమాజమంతా ఎట్లా ఏకమైతదో మీకు తెలుసు కదా? పొరపాటున మీరు ఎంఐఎంను గెలిపిస్తే హిందువులంతా ఒక్కటై మిమ్ముల్ని ఓడించడం తథ్యం. ఈ విషయాన్ని ఆలోచించండి ఎవరికి ఓటేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X