Yatra For Change: TSPSC పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు కానీ..పేపర్ లీకులు చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ లో పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం.” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని మోపాల్ చౌరస్తా నుంచి డిచ్‌పల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం డిచ్‌పల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాకు ఘన కీర్తి ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి నాయకులను మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ప్రశాంత్ రెడ్డి, మండలాలు కొడుకులకు పంచిపెట్టిన పోచారం, బాజిరెడ్డి, బిగాల గణేష్ మీకు ఎమ్మేల్యేలుగా ఉన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ కమీషన్లను కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి వదల్లేదు. తెలంగాణలో ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగులకు జీతాలు సరిగా రావు… ఆర్టీసీ సమ్మెకు, 50మంది ఆర్టీసీ కార్మికుల చావుకు కారణం బాజిరెడ్డి గోవర్ధన్ కాదా? కార్మికుల చావులపై హత్యా నేరం కింద బాజిరెడ్డి గోవర్ధన్ చర్లల్లి జైలులో చిప్ప కూడు తినిపించాలి.

కేసీఆర్ కు దురాశ కలిగిందో.. బిడ్డ చెప్పిందో.. మెగా కృష్ణా రెడ్డి కమీషన్లు దండుకోవడం కోసమో.. 300 కోట్ల ప్రాజెక్టును 3500 కోట్లకు తెచ్చిండ్రు. 10 తండాలను మంచిప్ప నీళ్లల్లో ముంచిండ్రు. ఊర్లు ముంచి ఒక్క ఎకరా ఆయకట్టు కూడా ఎక్కువ పెంచలేదు. కేసీఆర్ ధన దాహానికి 10వేల మంది తండావాసులు బలవుతున్నారు. ఈ తొమ్మిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? తెలంగాణకు ఏం ఒరిగింది? లక్షల కోట్లు ఎవరి ఇంట్లోకి పోయినయ్.. ఎవరింట్లో కనకవర్షం కురిసింది? 60 లక్షల మంది ఆడబిడ్డల ఉసురు పోసుకుని మహిళా సంఘాలను దివాళా తీయించారు.

బాజిరెడ్డి గోవర్ధన్.. దొర కాళ్లు మొక్కుతావో.. ఏం చేస్తావో..తక్షణమే మంచిప్ప ప్రాజెక్టు భూ సేకరణ ఆపాలి. 10 తండాల ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలి. బీఆరెస్ ప్రభుత్వం భూసేకరణ ఆపకపోతే.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత డిజైన్ ప్రకారమే 21 ప్యాకేజీ పనులు పూర్తి చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలందరికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం

శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఈ ఆలయ నిర్మాత, సినీ నిర్మాత దిల్ రాజు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంచిప్ప రిజర్వాయర్ పనులను పరిశీలించిన రేవంత్ రెడ్డి

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మంచిప్ప రిజర్వాయర్ పనులను పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆనాడు జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టి వారి గొప్పదనాన్ని చెప్పాలనుకున్నాం. 900 కోట్ల పైగా ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశాం. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులు పరిశీలించారు. కొండెం చెరువు కెపాసిటీ 0.84 టీఎంసీ.

ఈ ప్రాంతంలో పేదల భూములు ముంపుకు గురవుతాయని ఉన్నదాంట్లోనే లక్ష 83వేల ఎకరాకు నీరివ్వాలనుకుంది. ఇంకో 300కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి సాగు నీరు అందేది. కేసీఆర్ హయాంలో ఆయన స్వార్ధానికి ఈ ప్రాజెక్టు బలైంది. ఆయన అవినీతికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ. రూ.3500 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారు. భూసేకరణతో 10గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఆయకట్టు పెరగక పోయినా ఇక్కడి పేదలను భూ నిర్వాసితులను చేశారు. 300 కోట్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 3500 కోట్లకు పెంచారు.

ఉమ్మడి రాష్ట్రంలోలాగానే కేసీఆర్ పాలనలో అదే వివక్ష కొనసాగుతోంది. భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే 307 కేసులు పెట్టారు.17మంది ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వారిపై కేసులను బే షరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలి. తొమ్మిదేళ్లయినా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కేసీఆర్ ది దుర్మార్గమైన చర్య. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలి. భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. రీడిజైన్ ను వెనక్కు తీసుకుని.. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలి. ఈ ప్రాంత ప్రజలకు ఊరట కలిగించాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసింది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అమ్ముడుపోయారని ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసింది. నేను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను అనని వాటిని అన్నట్లుగా రాయడం సరైంది కాదు. మీడియా సంయమనం పాటించాలి. అలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయొద్దు

గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు : రేవంత్ రెడ్డి

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మోపాల్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చుట్టూనే తిరిగింది. ఈ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలని యూనివర్సిటీల నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఉద్యమాన్ని కేసీఆర్ రాజకీయ ఉపాధిగా మలచుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను నమ్మించారు. 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 1 లక్షా 50వేల ఖాళీలను భర్తీ చేస్తామని మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించారు.

తొమ్మిదేళ్లయినా ఆ హామీని కేసీఆర్ నేరవేర్చలేదు. నిరుద్యోగుల నిరసన తెలపకుండా ధర్నా చౌక్ చేశారు. తెలంగాణ వచ్చాక 2 వేల మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కేసీఆర్ పాల్పడిన హత్యలే. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయో చైర్మన్, సీఎం, వివరణ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట. 30 లక్షల మంది నిరుద్యోగుల వివరాలు దాచిపెట్టాలని చూసింది. టీఎస్పీస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఇప్పుడు లీకేజీలతో అభ్యర్థులను గందరగోళం లోకి నెట్టారు. గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రూప్-1 అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లోకి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారు. తెలంగాణ వచ్చాక ఏ పోటీ పరీక్ష కూడా పారదర్శకంగా నిర్వహించడం లేదు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలోను తప్పులు జరగడంతో 24 మంది విద్యార్థులు మరణించారు. ఇది సీఎం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం. టీఎస్పీఎస్సీ వ్యవహార శైలి లోపభూయిష్ఠంగా కనిపిస్తోంది. టీఎస్పీఎస్సీ ఉనికి ప్రశ్నర్ధకంగా కనిపిస్తోంది. లీకేజీల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణ వచ్చాక ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారంలో పాత్ర లేదని నిరూపించుకోవాలి. పెద్దలను కాపాడేందుకే దీనిపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సూమోటోగా స్వీకరించి విచారణ చేయొచ్చు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ తేల్చింది.

నియామకాలు చేపట్టాల్సిన టీఎస్పీఎస్సీలో 400 మంది ఉద్యోగులకు కేవలం 80 మంది ఉద్యోగులే ఉన్నారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్రశ్నాపత్రం లీకేజీ అసలు హానీ ట్రాపా.. హ్యాకింగా.. లీకేజీనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రశ్నాపత్రం లీకేజీపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X