“ముఖ్యమంత్రి సార్… ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?”

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రమను, రక్తాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకుంటామని, వర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జాడలేకుండా పోయాడని ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉస్మానియా నాన్ టీచింగ్ స్టాఫ్ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద చేపట్టిన ఆందోళనకు కవిత మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 35 ఏళ్లుగా ఉస్మానియాలో నాన్ టీచింగ్ స్టాఫ్ కు అన్యాయం జరుగుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉండటం క్షమించరని నేరమన్నారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లుగానే ఉద్యోగి ఏడ్చిన యూనివర్సిటీ బాగుండదన్నారు.

వీసీని చరిత్ర క్షమించదు

నాన్ టీచింగ్ ఉద్యోగులంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా ఉండాల్సిన వీసీ.. ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని కవిత మండిపడ్డారు. టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా వారిని కాదని కొత్త వాళ్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముందు ఉద్యోగులపై ప్రేమ చూపించాలని కోరారు. ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే వారిని వీసీ ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఉస్మానియాకు 105 ఏళ్లలో తొలిసారి మాదిగా బిడ్డను వీసీని చేశామని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నాడని..కానీ నిధులు ఇవ్వకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడని ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా వీసీ ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే వీసీయే ప్రభుత్వం కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడా అని నిలదీశారు. అటానమస్ గా ఉండి ఉద్యోగులకు కోసం పోరాటం చేయాల్సిన వీసీ ప్రభుత్వానికి గులాం గిరి చేయటం మంచిది కాదని చెప్పారు. యూనివర్సిటీ కోసం ప్రభుత్వం తో కొట్లాడి బాగు చేసుకున్న వీసీలను చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని.. కానీ ప్రభుత్వం కోసం వర్సిటీ ప్రయోజనాలను తాకట్టు పెడితే చరిత్ర క్షమించదని వీసీని హెచ్చరించారు.

ఏడాదిన్నరగా పట్టించుకోవటం లేదు

ఏడాదిన్నరగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే ఎందుకు స్పందించటం లేదని కవిత ప్రశ్నించారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు లేకుండా చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో ప్రదర్శించే తెలితేటలను ముఖ్యమంత్రి వద్ద ప్రదర్శించి ఉద్యోగులకు మేలు చేయాలని కోరారు. ఓయూలో 85 శాతం లోకల్ వాళ్లనే నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ బీహార్, యూపీ వాళ్లను సెక్యూరిటీ కోసం నియమిస్తున్నారన్నారు. యూనివర్సిటీలో జరిగే అవినీతి బయట పడకుండా ఉండేందుకే బయట వాళ్లను నియమిస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్య లపై వర్సిటీ ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ ఎందుకు స్పందించటం లేదని ఆమె ప్రశ్నించారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోని నాన్ టీచింగ్ స్టాఫ్ కు మేలు జరిగేలా చూడాలని గవర్నర్ ను కోరారు.

ఓపీఎస్ అమలు చేయాలి

ఉస్మానియాలో ఉద్యోగులకు ఓపీఎస్ స్కీమ్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెప్పారని కవిత అన్నారు. 2001 నుంచి 2004 వరకు ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తింపజేయాలన్నారు. 2004 నుంచి ఉన్న వారికి కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను వర్తింపజేయాలన్నారు. ఏటా ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని, చనిపోయిన టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఇది కూడ చదవండి-

కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ తీసేసి అందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ఈహెచ్ఎస్ స్కీమ్ ను రెగ్యులర్ ఎంప్లాయిస్ మాదిరిగా వర్తింజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అదే విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులైనా శ్రీకాంత్ గౌడ్, ఆకాష్ లకు అండగా నిలవాలని ఉద్యోగులను ఈ సందర్భంగా కవిత కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar