Crime News: IT अधिकारी होने का दावा कर चोर गिरोह उठा ले गये दो किलो सोना, छाती पीटता रह गया पीड़ित

हैदराबाद: सिकंदराबाद के मोंडा मार्केट में दिनदहाड़े लूट की बड़ी घटना हुई है। फिल्मी स्टाइल में हुई इस चोरी से हड़कंप मच गया है। खुद को आईटी विभाग का अधिकारी बताकर एक चोर गिरोह बालाजी सोने की दुकान में घुस गया और निरीक्षण कर 2 किलो सोना लेकर फरार हो गया।

ठगे जाने का एहसास होने पर पीड़ितों ने मोंडा मार्केट पुलिस में शिकायत दर्ज की। पुलिस ने इस मामले को गंभीरता से लेते हुए विशेष टीमों का गठन कर चोरों के गिरोह की तलाश तेज कर दी है।

पुलिस के अनुसार, शनिवार (27 मई) सुबह पांच व्यक्ति मोंडा मार्केट स्थित एक ज्वेलरी की दुकान पर गए। वे दुकान पर आए और कर्मचारियों और प्रबंधन को यह कहते हुए धमकाया कि उन्होंने सोने की खरीदी-बिक्री में धोखाधड़ी की है। दुकान में सारा सोना चेक करने की बात कही और कर्मचारियों को साइड में बिठा दिया गया।

बदमाशों ने कहा कि दुकान में 1700 ग्राम सोने के संबंध में कोई कर नहीं चुकाया गया है। साथ ही कहा कि वे सोना कब्जे में ले रहे हैं। और बिना नोटित दिए वे सोना लेकर चले गए।

यही बात बालाजी ज्वेलरी शॉप के मालिक ने क्षेत्र की अन्य ज्वैलरी शॉप के मालिकों को भी यह बात बताई। उन्होंने पीड़ित से कहा कि आईटी अधिकारी छापा मारते है तो पहले नोटिस देते है। यह बात सुनकर मालिक हैरान रह गया। वह तुरंत मोंडा मार्केट थाने गया और शिकायत दर्ज कराई। पुलिस यह जानकर चौंक गये कि जो लोग उसकी दुकान पर आए थे, वे आईटी अधिकारी नहीं, बल्कि चोरों के एक गिरोह था।

पुलिस ने पीड़िता द्वारा दी गई शिकायत के आधार पर मामला दर्ज कर लिया है और सभी कोणों से जांच शुरू कर दी है। आईटी अधिकारियों से बातचीत के बाद पुलिस इस नतीजे पर पहुंची कि सोना ले जाने वाले फर्जी आईटी अधिकारी हैं। सीसीटीवी फुटेज की जांच के बाद पुलिस ने पाया कि पांच लोगों ने आईटी अधिकारियों के नाम से दुकान में तलाशी ली।

पता चला कि जिस तरह से आयकर अधिकारी तलाशी लेते हैं, उसी तरह तलाशी ली गई ताकि सोने की दुकान के मालिक को कोई शक न हो। सोना लूटने के बाद आरोपी सिकंदराबाद से उप्पल की ओर जाते पाए गए।

उत्तरा मंडल की डीसीपी चंदना दीप्ति ने कहा कि मोंडा मार्केट थाना क्षेत्र में हुई सोना चोरी की घटना के आरोपियों को पकड़ने के लिए पांच विशेष टीमों का गठन किया गया है। सीसीटीवी फुटेज की जांच के बाद घटना में छह लोगों के शामिल होने का पता चला है।

Crime News: ఐటీ అధికారులం అంటూ 2 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు

హైదరాబాద్: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతోంది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టిన ముఠా 2 కిలోల బంగారంతో ఉడాయించింది.

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

శనివారం ( మే 27న) ఉదయం ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్‌లోని ఓ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి సిబ్బందిని, యాజమాన్యాన్ని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు.

షాపులో ఉన్న 1700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించలేదని చెప్పి. గోల్డ్ ను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు. 

ఇదే విషయాన్ని బాలాజీ జ్యూవెలరీ దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులక చెప్పాడు. ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేయరని, ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో సదరు బాధితుడు ఖంగుతిన్నాడు. వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తమ షాపునకు వచ్చిన వ్యక్తులు ఐటీశాఖ అధికారులు కాదని, దొంగల ముఠా సభ్యులని తెలిసి నిర్ఘాంతపోయాడు. 

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ అధికారులతో మాట్లాడి బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు.

బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిలో తనిఖీల చేశారని గుర్తించారు. బంగారం దోపిడీ చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన బంగారం చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించామన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X