ओलावृष्टि से विमान का अगला हिस्सा क्षतिग्रस्त, बाल-बाल बचे 227 यात्री, इसे कहते हैं मौत के मुंह से निकलना

हैदराबाद : खराब मौसम की वजह से दिल्ली-श्रीनगर फ्लाइट अचानक ओलावृष्टि में फंस गई. विमान हिचकोले खाने लगा, हालांकि, पायलट और क्रू मेंबर की सूझबूझ की वजह से विमान की श्रीनगर में सुरक्षित लैंडिंग हो गई. इससे एक बड़ा हादसा टल गया और विमान को सुरक्षित श्रीनगर एयरपोर्ट पर लैंडिंग कराया गया.

इंडिगो ने प्रेस बयान जारी कर बताया, “दिल्ली से श्रीनगर जा रही इंडिगो की फ्लाइट 6E 2142 को रास्ते में अचानक ओलावृष्टि का सामना करना पड़ा. फ्लाइट और केबिन क्रू ने स्थापित प्रोटोकॉल का पालन किया और विमान को श्रीनगर में सुरक्षित रूप से उतारा गया. विमान के आगमन के बाद एयरपोर्ट की टीम ने ग्राहकों की देखभाल की और उनकी भलाई और आराम को प्राथमिकता दी. आवश्यक निरीक्षण और रखरखाव के बाद विमान को छोड़ दिया जाएगा.”

Also Read-

విమానం ముందు భాగం పగిలింది, 227 ప్రయాణికుల గుండె ఆగినంత పనైంది, అసలేం జరిగిందంటే…

హైదరాబాద్ : ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా ఉన్నట్టుండి వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద పెద్ద వడగళ్లు ఎవరో రాళ్లతో కొట్టినట్టే విమానంపై పడ్డాయి. వడగళ్ల దెబ్బకు విమానం ముందు భాగం గాల్లోనే ధ్వంసమైంది. ఈ విమానంలో 227 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. ఏ బాంబో మీదొచ్చి పడిందని ప్రయాణికులు హడలెత్తిపోయారు.

పైలట్తో పాటు క్యాబిన్ క్రూ అప్రమత్తంగా వ్యవహరించి.. ప్రయాణికులకు ధైర్యం చెప్పి శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం 6.30 సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ విమానం ల్యాండ్ అవగానే ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో విమానం ముందు భాగానికి వడగళ్ల దెబ్బకు చిల్లు పడింది.

2023లో కూడా ఇండిగో విమానానికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E 6594 వడగళ్ల వాన దెబ్బకు పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే 27Lపై విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. అయితే విమానం ముందు భాగం, రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానం గాల్లో ఉండగా ఇలాంటి ఘటనలు జరిగితే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనక తప్పదు. తాజా ఘటనలో.. ఇండిగో విమానానికి ఏం జరిగిందో ఇండిగో యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X