రైతుబంధు పై CM KCR పెద్ద ప్రకటన, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో పైసలే పైసలు

Hyderabad: రైతుబంధు పై CM KCR పెద్ద ప్రకటన చేసారు. పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మోతె జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసారు. ఆయన మాట్లాడుతూ… “వరద కాలువ కథ రాస్తే రామయణం అంత… చెబితే భారతమంతా. దానికి తూములు, కాలువలుండవ్‌. అందులో చేరిన గుంటల్లో కరెంటు మోటార్లు పెట్టి అద్దెకరం పారిస్తే ఆ నాడు మోటార్ల తీగలు కోసేసి కాలువలో తోసేసిన నాకు తెలుసు. ఆ కష్టాలు నాకు తెలుసు. వరద కాలువను రిజర్వాయర్‌గా, జీవనదిగా మార్చుకున్నాం. ఎన్ని తుములు అవసరమో అన్ని పెట్టుకున్నాం. వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సుభిక్షంగా పంటలు పండించుకుంటున్నాం.”

“ఈ రోజు కూడా వరద కాలువ మీద సుమారు 13వేల మోటార్లు ఉన్నయ్‌. రైతులు పంటలు పండిస్తరు. రైతులకు పంటలు పండించేందుకు ఆనాడు తెలంగాణలో, కరువులో పెరుగన్నం పురుగు మందులు తాగి, దుబాయి, ముంబాయికి అనేక బాధలు పడి చెట్టుకొకరైన గుట్టకొకరైన తెలంగాణ రైతులు బాగుపడాలని చెప్పాను. ఖచ్చితంగా అద్భుతమైన వనరుగా మార్చుకుందాం.. సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పాను. 24 గంటల కరెంటు ఇస్తున్నాం. సంవత్సరానికి 13,14 వేలకోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం కోరుట్ల, మెట్‌పల్లి, చొప్పదండి, కరీంనగర్‌ ప్రాంత వాసులకు బాగా తెలుసు. ఎన్ని మోటార్లు పెట్టావ్‌? ఎంత హెచ్‌పీలు ఉన్నయ్‌? ఎంత బిల్లు కడుతువ్‌ అని అడిగే కొడుకు ఉన్నడా? దానికి మీటర్లు పెట్టమంటున్నరు? వరద కాలువ తూముల్లో మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం” ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు.

“ఈ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే ఏ రాష్ట్రం లేదు. రైతుబీమా ఇచ్చే దేశం లేదు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చేది తెలంగాణ. అనాలోచితంగా, ఆగమాంగ ఇచ్చేది కాదు. చితికిపోయి, ఛిద్రమైన ఆగమైన తెలంగాణ రైతుల బతుకులు ఓదరికి రావాలని, అప్పులు తీరాలని, ఆ బాధలు తప్పాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్‌, రైతుబీమా, రైతుబంధు. అంతటితో ఆగకుండా భారతదేశంలో ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయదు. ఎక్కడా లేనివిధంగా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే రంది లేకుండా, అమ్మిన పంటకు ఐదురోజుల్లోనే బ్యాంకులు డబ్బులు వచ్చేలా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు వస్తది? ఇంకో ఐదుపది రోజుల్లో రైతుబంధు పడుతుంది? పడాలి కదా? ఎట్ల పడుతది.. బ్యాంకుల్లో పడంగనే టింగుటింగుమని ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తది.”అని కెసిఆర్ అనారు.

“ఎల్లుండి క్యాబినెట్‌ మీటింగ్‌ ఉంది. అక్కడ నిర్ణయం తీసుకొని ఖాతాల్లో జమ చేస్తాం. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్‌ బతికున్న వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదు. కొన్ని పనులు పూర్తి కావాలి. వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్‌, బీమారం సూరమ్మ చెరువు నింపి మూడు మండలాలకు నీరిస్తాం. మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం కొట్లాడుతున్నడు. త్వరలో మంజూరు చేసి లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తాం. పోతారం, నారాయణపూర్‌ రిజర్వార్లను పూర్తి చేస్తాం. కేసీఆర్‌ కన్నా ముందు, టీఆర్‌ఎస్‌కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను చూశారు. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా తెలంగాణలో రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నాం. రేషన్‌కార్డులతో బియ్యం, పిల్లలకు ఉద్యోగం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం, కల్యాణలక్ష్మి కింద వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం” సిఎం అన్నారు.

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు

“జ‌గిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడ‌మే కాదు.. ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుకున్నాం. ఈ సంద‌ర్భంగా జ‌గిత్యాల జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌, ప్ర‌జ‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌లు, శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. క‌ల‌ల‌లో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయిత‌దని, బాగా అభివృద్ధి చెందుతుంద‌ని. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది కాబ‌ట్టి జ‌గిత్యాల జిల్లా ఏర్పాటైంది. ఉద్య‌మం జ‌రిగే సంద‌ర్భంలో అత్యంత మ‌హిమాన్విత‌మైన, అద్భుత‌మైన న‌ర‌సింహాస్వామి ధ‌ర్మ‌పురికి వ‌చ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. గోదావ‌రి న‌ది.. నాటి ఏపీలో తెలంగాణ‌లో మొద‌ట ప్ర‌వేశిస్తే గోదావ‌రి పుష్క‌రాలు ఎందుకు జ‌ర‌ప‌రు అని సింహాంలా గ‌ర్జించాను. దాని మీద చాలా ర‌కాలుగా మాట్లాడారు. ధ‌ర్మ‌పురి స్వామి చాలా మ‌హిమాన్విత‌మైన‌ స్వామి. శేష‌ప్ప క‌వి స్వామి మీద అద్భుత‌మైన ప‌ద్యాలు రాశారు. స్వామి వారిని ద‌ర్శించి నీ ద‌య వ‌ల్ల పుష్క‌రాలు జ‌రుపుదాం అని మొక్కుకున్నాను. మ‌ళ్లీ పుష్క‌రాలు వ‌చ్చే లోపు రాష్ట్రాన్ని సాధించి, ఇక్క‌డే పుష్క‌రాలు జ‌రుపుదామ‌ని మొక్కాను. నిండు మ‌న‌సుతో మొక్కాను. ధ‌ర్మ‌ప‌త్ని స‌మేతంగా వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో ధ‌ర్మ‌పురిలో పుష్క‌ర స్నానం చేసి స్వామి వారిని ద‌ర్శించుకున్నాను. పండితులు తెలంగాణ ప్రాప్తిర‌స్తు అని దీవెన ఇచ్చారు. స్వామి వారి ద‌య, వేదపండితుల ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్క‌రాలు జ‌రుపుకున్నాం. ల‌క్ష‌లాది మంది ధ‌ర్మ‌పురికి త‌ర‌లివ‌చ్చారు. మంత్రులు ట్రాఫిక్ పోలీసుల్లా వ్య‌వ‌హ‌రించి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా పుష్క‌రాలు నిర్వ‌హించుకున్నాం. చాలా అద్భుతంగా ముంద‌కు పోతున్నాం.” అని సిఎం అన్నారు.

“తెలంగాణ ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వ‌రం, ధ‌ర్మ‌పురి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న దేవాల‌యంతో పాటు ప‌లు పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. కొండ‌గ‌ట్టు అంజ‌న్న స‌న్నిధికి హ‌నుమాన్ భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. అంజ‌న్న దేవ‌స్థానం కేవ‌లం 20 ఎక‌రాల్లో మాత్ర‌మే ఉండేది. 384 ఎక‌రాల స్థలాన్ని దేవాల‌యానికి ఇచ్చాం. 400 ఎక‌రాల భూమి కొండ‌గ‌ట్టు క్షేత్రంలో ఉంది. కొండ‌గ‌ట్టు అంజ‌న్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే నేను స్వ‌యంగా వ‌చ్చి ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం, భార‌త‌దేశంలో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి పుణ్య‌క్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను.” అని హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించారు (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X