హైదరాబాద్ : ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మహిపాల్ రెడ్డి, తెలంగాణ టీచర్స్ యూనియన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జుర్రు నారాయణ యాదవ్ కలిసి ధన్యవాదాలు తెలుపుతూ ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

ముఖ్యంగా SGTలకు న్యాయం చేయాలని కోరుతూ, ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్స్ చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి టిపిసీసీ అధికార ప్రతినిధి, బి వెంకటేశం, ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం, శ్రీమతి ఎ శ్రీదేవసేన, కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు మునగాల మహిపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుతెలంగాణ టీచర్స్ యూనియన్, జుర్రు నారాయణ యాదవ్ జిల్లా అధ్యక్షులు మహబూబ్ నగర్ పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి-